Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |
Showing posts with label Networking. Show all posts
Showing posts with label Networking. Show all posts

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు

19 January 2010

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
మీరు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రియులా? ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు వాడుతున్నారా? అయితే, ఈ ఏడు వారధులు మీకు తప్పని సరి! ఫేస్‌బుక్‌.. మైస్పేస్‌.. ట్విట్టర్‌.. లింక్డిన్‌.. ఇలా అన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ల్లోనూ సైన్‌ఇన్‌ అయ్యి మిత్ర బృందంతో ఆన్‌లైన్‌ రచ్చబండపై విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుకోవడం నేటి తరం నెటిజన్లకు సర్వసాధారణం అయిపోయింది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల యూజర్లు సభ్యత్వం తీసుకున్నారంటే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పరిధిని అంచనా వేయవచ్చు. అంతేకాదు 3.5 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి స్నేహితులతో పంచుకుంటూ రోజులో 55 నిమిషాలు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేసుకునే మార్గాలున్నాయి. ఒక్కొక్కటిగా సైన్‌ఇన్‌ అవ్వకుండానే అన్ని అప్‌డేట్స్‌ని సులువుగా ఒకేచోట పొందొచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం!
ఈక్రింద ఇవ్వబడినవి


ప్రఖ్యాత వెబ్ ఆర్కిటెక్చర్లు

28 November 2009


ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం



నెట్‌వర్క్ లోని వివిధ పరికరాలు

16 October 2009


క్రిందటి టపాలో  నెట్‌వర్క్ అనగా ఏమిటో , నెట్‌వర్కింగ్ అనగా ఏమిటో తెల్సుకున్నాము కదా , ఈ టపాలో నెట్‌వర్క్ లోని వివిధ పరికరాలైన ల్యాన్ కేబుల్, నిక్ (NIC), హబ్, స్విచ్, రూటర్, బ్రిడ్జ్ గూర్చి తెల్సుకుందాం.
మొదటి టపా ఇక్కడ చూడగలరు.

ల్యాన్ కేబుల్

    • ఇది మనం కంప్యూటర్లను నెట్‌వర్క్ తో అనుసంధానించటం కోసం వాడుతాము. ఇది ట్విస్టెడ్ పైర్ క్యాట్ - 3. లేదా క్యాట్ - 5 రకం కేబుల్.
    • ఈ కేబుల్ ని కంప్యూటర్ కి RJ-45 కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేస్తాము.
    • క్యాట్ కేబుల్ లో ముఖ్యంగా మూడు రకాలను వాడుతున్నాము అవి
    • క్యాట్ - 3 కేబుల్ ని సాధారణ డేటాని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 10 Mbps వేగముతో డేటాని పంపవచ్చును
    • క్యాట్ - 5 కేబుల్ ని సాధారణ డేటా మరియు ధ్వని సమాచారాన్ని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 100 Mbps వేగముతో డేటాని పంపవచ్చును.
    • క్యాట్ - 5E కేబుల్ ని సాధారణ డేటా మరియు ధ్వని సమాచారాన్ని పంపుటకు వాడుతాము , దీని ద్వారా 1000 Mbps వేగముతో డేటాని పంపవచ్చును .

నిక్ (NIC)

ఇది మన కంప్యూటర్ లో ఉండే నెట్వర్క్ కార్డు. (మాక్ అడ్రస్ ల అధారంగా) రెండు కంప్యూటర్ల మధ్య అనుసంధానానికి ఉపయోగపడుతుంది. మనం మామూలుగా ఇంటర్నెట్ కనెక్షన్ కి కూడా ఇదే వాడతాము.


హబ్

నెట్‌వర్క్ లోని పరికరాలను (కంప్యూటర్లు , ప్రింటర్లు) ని అనుసంధానించటానికి హబ్  ని వాడుతాము. హబ్ లలో మన అవసరాన్ని బట్టి 6 ,8 ,16 ,24 పరికరాలను ఒకే సారి అనుసంధానించవచ్చు. ఈ హబ్ లు చేసే పనల్లా వచ్చిన డేటా ప్యాకెట్లు అన్నిటిని వచ్చిన దారి తప్పితే మిగతా దారులన్నిటికి నకలు చేసి పంపిచేయడమే. అయితే ఇందులో కొన్ని ఇంటెల్లిజెంట్ హబ్ లు అని ఉన్నాయి. అవి కాస్త బిన్నంగా, వచ్చిన డేటా ప్యాకెట్ల అడ్రస్లు చూసి తగిన గమ్యానికి చేరుస్తాయి.

బ్రిడ్జ్

హబ్ చేయని బ్రిడ్జ్ చేసే పనల్లా, వచ్చిన డేటా ప్యాకెట్ ని పరిశీలించి పంపాలా వద్దా అని చెక్ చేయడమే. ఒక నెట్వర్క్ లో రెండూ సెగ్మెంట్లు ఉన్నాయనుకుందాం. ఆ రెండూ సెగ్మెంట్లు పెద్దగా డేటా ని పంపుకోవు కానీ, కనెక్టయి మాత్రం ఉండాలి. ఒకవేళ ఈ రెండూ సెగ్మెంట్లు హబ్ తో అనుసందానించబడితే ఏ కంప్యూటర్ ఏ కంప్యూటర్ కి డేటా పంపించిన ఆ డేటా అనవసరంగా అన్నీ కంప్యూటర్లకి పంపించబడుతుంది. అది వృదా కదా? అందుకే బ్రిడ్జ్ వాడటం. ఇదేం చేస్తుందంటే ఒక నెట్వర్క్ ని రెండూ సేగ్మేంట్ల లా విడగొట్టి, పంపిన ప్యాకెట్ లో ఉన్న అడ్రస్ అవతలి సెగ్మెంట్ లో ఉంటేనే ఆ ప్యాకెట్ అవతలి సెగ్మెంట్ కి చేరవేస్తుంది, లేదా వెళ్ళనియ్యదు. అందుకే బ్రిడ్జ్ కి రెండే పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఇన్కమింగ్, ఇంకోటి ఔట్గోయింగ్.

స్విచ్

స్విచ్ ని కూడా నెట్‌వర్క్ లోని పరికరాలను అనుసంధానించటానికి వాడుతాము. స్విచ్ లలో మన అవసరాన్ని బట్టి 4 ,8 ,16 ,24 పరికరాలను ఒకే సారి అనుసంధానించవచ్చు.  స్విచ్ కూడా బ్రిడ్జ్ లానే పని చేస్తుంది కానీ ఒక చిన్న తేడా ఉంది, బ్రిడ్జ్ లో రెండే పోర్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అదే స్విచ్ లో చాలా వుంటాయ్. అంటే రెండే సెగ్మెంట్లు కాకుండా మల్టిపుల్ సెగ్మెంట్లు ఉండవచ్చన్నమాట.

రూటర్

స్విచ్ కి రూటర్ కి ముఖ్య బేదం - స్విచ్ మాక్ అడ్రస్ అధారంగా పనిచేస్తుంది, రూటర్ ఐపీ అడ్రస్ల అధారంగా పనిచేస్తుంది. రూటర్ ని మనం రెండు వేరు వేరు నెట్‌వర్క్ లను అనుసంధానించటానికి వాడుతాము. రూటర్ తనకు వచ్చిన డేటాని పరిశీలించిన తర్వాతే మరొక నెట్‌వర్క్ కి పంపిస్తుంది. సాధారణంగా రూటర్ ని రెండు ల్యాన్ లని అనుసంధానించడానికి వాడుతాము . రూటర్ ని  మన ల్యాన్ ని ఇంటెర్నెట్కి అనుసంధానించటానికి కూడా వాడుతాము. ఇంట్లో మనకు ఎక్కువ కంప్యూటర్లు ఉంటే వాటన్నిటికి ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ తీస్కుంటే, వాటిని ఒక లాన్ లా భావించి ఒక రూటర్ సాయంతో వాటన్నిటికి ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా నెట్ సదుపాయం కుదర్చవచ్చు.

నెట్వర్కింగ్ పై ప్రాధమిక సమాచారం

08 October 2009


నెట్వర్కింగ్ అనగా ఏమిటి? నెట్వర్కింగ్ చేయటానికి ఏమేమి పరికరాలు కావాలి? అన్న అంశాల మీద ఒక వివరణ.



ముందు మనం నెట్వర్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలి . రెండు లేక అంత కన్నా ఎక్కువ పరికరాలు (కంప్యూటర్లు, ప్రింటర్లు ఇంకా ఇలాంటివి) ఒక మాధ్యమం ద్వార అనుసందానించబడితే దానినే ఒక నెట్వర్క్ అంటాము. ఇప్పుడు ఈ నెట్వర్క్ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే ప్రక్రియను నెట్వర్కింగ్ అంటారు .

ఏమేమి కావాలి?

రెండు పరికరాలను అనుసందానించాలంటే మనకొక మాధ్యమం కావాలి . మాధ్యమం రెండు రకాలు .
  • తీగలు ఉపయోగించి అనుసంధానించడం (wired)
  • తీగలు లేకుండా అనుసంధానించడం (wireless)
ఈ రెండింటి లో ఏదో ఒక మార్గం అనుసరించి అనుసంధానించవచ్చు. మనం ఒక్కొక్క మార్గాన్నీ విడివిడిగా చూద్దాం. ఇక్కడ చెప్పే విధానం లో విండోస్ ఆపరేటింగ్ సిస్టంని తీస్కోవడం జరిగింది. ఇదే సమాచారం లో వివరణ లినక్సుకి కూడా వర్తిస్తుంది.
అనుసందానించబడాలంటే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక గుర్తింపు నామము(system identity), డొమైన్ నామము(domain name),నెట్వర్క్ గుర్తింపు(network id అంటే IP Adress) ఉండాలి.
ప్రత్యేక గుర్తింపు నామము :: ఇది మీ కంప్యూటర్ నామము. ఇది సాదారణంగా OS ఇన్స్టాల్ చేసేప్పుడు ఇచ్చి వుంటారు . ఇప్పుడు చూడాలనుకుంటే  My Computer మీద రైట్-క్లిక్ ఇచ్చి properties ఆప్షన్ ని ఎంచుకోండి .computer name కోసం వెతకండి.
డొమైన్ నామము ::  నెట్వర్క్ లోని కొన్ని పరికరాలు ఒక  సముదాయముగా ఏర్పడితే దానిని ఒక డొమైన్ అంటాము. ప్రతి  కంప్యూటరుకు ఒక డొమైన్ నామము ఉంటుంది. ఇది కూడా OS ఇన్స్టాల్ చేసేప్పుడు ఇచ్చి వుంటారు .ఇప్పుడు చూడాలనుకుంటే  మై Computer మీద రైట్-క్లిక్ ఇచ్చి properties ఆప్షన్ ని ఎంచుకోండి .workgroup కోసం వెతకండి.
నెట్వర్క్ గుర్తింపు :: నెట్వర్క్ లో మీ కంప్యూటర్ రిజిస్టర్ ఐన వెంటనే నెట్వర్క్ అడ్మినిష్ట్రేటర్ మీకు ఈ సభ్యత్వ గుర్తింపుని ఇస్తారు . డొమైన్ నామము లాగానే ఈ గుర్తింపు కూడా కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఇంటర్నెట్ లేదా ఇతర ప్రైవేటు నెట్వర్క్లలో  మాత్రమే. మీరు ఇంట్లోనే నెట్వర్క్ ఏర్పరుచుకోదలిస్తే ఈ గుర్తింపుని మీరే ఇచుకోవచ్చు.
ఎలా అనుసందానిచాలి? సమాచారాన్ని ఎలా  పంపాలి? తర్వాతి టపా లో చుద్దాం

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English