Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label Linux Commands. Show all posts
Showing posts with label Linux Commands. Show all posts
లినక్సులో FFMPEG
09 November 2009Posted by
INDUSTAN
0 Comments
ఇంతకు ముందు ఒక పోస్టులో FFMPEG విండోస్ లో ఎంత సులువుగా ఉపయోగించవచ్చో చూశాము. ఇప్పుడు, లినక్సు లో FFMPG గురించి వివరాతి వివరంగా తెలుసుకుందాం.1. ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలి?
లినక్స్ లో వచ్చే చిక్కేంటంటే, రకరకాల లినక్సు లు ఉండి, దేనికి దానికే ఒక్కో పద్దతి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ పని చేసేలా ఒక పద్దతి చెప్తాను, చేసెయ్యండి! ముందు, ఈ క్రింది చెప్పిన లైబ్రరీ లు అన్నీ ఇన్స్టాల్ చేస్కోవాలి. మీరు వాడే లినక్సులో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొడానికి ఒక ప్యాకేజీ మేనేజర్ ఉంటుంది (ఫెడోరా ఐతే యమ్, ఉబుంటు ఐతే సినాప్టిక్/అప్ట్-గెట్) దానిలో ఈ క్రింది పదాలతో శోదించి, ఆ వచ్చిన ఫలితాల్లో, ఆయా పేర్లతో ఉన్న ప్యాకేజీ లను, వాటి డెవలప్మెంట్ ప్యాకేజీ లను ఇన్స్టాల్ చేసెయ్యండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజీ మేనేజర్ లు వాడటం తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
liba52
libgsm
libxvid
libamr
libmp3lame
libogg
libvorbis
libfaac
libfaad
libx264
ఉదాహరణకి, మీరు libogg గురించి శోదిస్తే, అక్కడ వచ్చిన వాటిల్లోంచి libogg0, libogg-dev లను ఇన్స్టాల్ చేయాలి, అలా అన్నిటికీ చెయ్యాలి. ఇది పూర్తయ్యాక, ఇక్కడున్న ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కొండి. ఆ డౌన్లోడ్ చేస్కోగా వచ్చిన ప్యాకేజీ ని ముడి విప్పండి(అంటే untar చేయండి అని, క్రింద, దానికి కూడా కమాండ్ ఇచ్చాను, చూడండి). ఆ తర్వాత, విప్పితే వచ్చిన డైరెక్టరీ కి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఈ క్రింది కంమాండ్లు కొట్టండి.
మీరు డౌన్లోడ్ ఎక్కడికి చేసారో, అక్కడికి ఒక టెర్మినల్ లో వెళ్లి, ఇలా ముడివిప్పండి.
tar -xvf ffmpeg-0.5.tar.bz2
ఇప్పుడు ఒక ఫోల్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళండి.
cd ffmpeg-0.5
ఇప్పుడు ఈ క్రింది మూడు కంమాండ్లు కొట్టేయండి.
./configure --enable-gpl --enable-libfaac --enable-libfaad --enable-libgsm --enable-libmp3lame --enable-libtheora --enable-libvorbis --enable-nonfree --enable-shared --enable-x11grab --enable-libx264 --enable-libxvid --enable-pthreads --enable-libopenjpeg --enable-swscale
make
make install
make కొట్టాక కొంచెం టైం పడుతుంది (కొంచెం అంటే చా.....లా అన్న మాట! హాయిగా బొంచేసి రావచ్చు!). తర్వాత make install కొట్టడం మర్చిపోకండి. అంతా సవ్యంగా అయిపోతే, ఇక మీ పంట పండినట్టే :) అవ్వకుంటే, ఇక్కడ అడిగేస్తే, తెలిసినవారు జవాబిస్తారు.
అక్కడితో ఇన్స్టాల్ చేయడం సమాప్తం! ఇక పని చేస్తుందో లేదో చూడడానికి ఒక రాయి వేద్దాం, ఏదన్నాఆడియో/ వీడియో ఉంటే పట్రండి. మీరు తెచ్చిన ఆ వీడియో పేరు sample.mp3 అనుకుందాం. ఇప్పుడు అది కనీసం ౫ నిమిషాల నిడివి ఉందనుకుంటే, అందులోంచి ౨ నిమిషాల నుంచి ౩ నిమిషాల మధ్యలో ఉన్న ముక్కని ఒక wav లా కట్ చేద్దాం. దానికి ఈ కమాండ్ కొట్టండి.
ffmpeg -sameq -ss 00:02:00 -t 00:01:00 -i sample.mp3 sample.wav
మీరు అనుకున్నట్టు వస్తే మనం కుమ్మేసినట్టే. రాకపోతే, అదేమంటుందో చెప్తూ ఇక్కడ ఒక వ్యాఖ్యలో అడగండి, పరిష్కారం చెప్తాము. వచ్చే పాఠ్యాంశంలో ffmpeg తో మరిన్నినిత్య ఉపయోగకర కంమాండ్ల తో, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.
లినక్స్ కమాండ్లతో నావిగేషన్
08 October 2009Posted by
INDUSTAN
దీనికి ముందు లినక్స్ లో ఫైల్స్ ఎలా అమర్చబడతాయో తెలుసుకోవాలి..లినక్స్ లో ఫైల్స్ హైరార్కికల్ గా ( అంటే తిరగేసిన చెట్టు - మొదలు పైకి కొమ్మలు కిందకి ) అమర్చబడతాయి. దీనినే డైరెక్టరీ స్ట్రక్చర్ అని అంటారు(లినక్స్ లో ఫోల్డర్లను డైరెక్టరీ అని అంటారు). అంటే ఈ డైరెక్టరీలను (తిరగేసిన) చెట్టు లాగ అమర్చుతారన్నమాట. ఈ విధంగానే ఉన్న అన్ని ఫైల్స్, డైరెక్టరీలు అమర్చబడి ఉంటాయి. ఇందులోని మొట్ట మొదటి డైరెక్టరీ ని root అంటారు. దీనిని "/" గుర్తు తో చూపుతారు.ఇక్కడి నుండి అమరిక మొదలై కిందకి చెట్టు లాగ ఫైల్స్ మరియు డైరెక్టరీలు అమర్చబడి ఉంటాయి. ఈ రోజున చాల గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్లు(GUI లు) ఫైల్ మేనేజర్ అనే ఒక ప్రోగ్రాంను అందిస్తున్నాయి. ఉదాహరణకి గ్నోం(Gnome) డెస్క్టాపులో నాటిలస్(nautilus) అనేది ఫైల్ మేనేజర్, కే.డి.ఇ లో కాంకరర్(konqueror) ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వార మనం మన ఫైల్ సిస్టం స్ట్రక్చర్ ని చూడొచ్చు. కావాలనుకున్నప్పుడు దానికి అవసరమైన మార్పులు చేయవచ్చు - ఒక ఫోల్డర్/ఫైల్ ని సృష్టించడం, తీసి వెయ్యడం, అమరిక మార్చడం లాంటివి. ఈ క్రింది బొమ్మను చుడగలరు. 
మిగిలిన OS లకు లినక్స్ / యూనిక్స్ లకు తేడ ఏంటంటే ఇక్కడ డ్రైవ్లను drive letters (C,D,E లాంటివి) తో సూచించరు. అలా చేయడం వల్ల ఒక్క డ్రైవ్ ను ఒక్కో ట్రీ గా చూపించాల్సి వస్తుంది, అదే లినక్స్ లో ఒక ట్రీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. ఎన్ని డ్రైవ్ లు ఉన్నా అవి ఇందులోనే అమరిపోతాయి. అందువల్ల ఒక డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీ కి వెళ్ళడం చాలా సులువవుతుంది.

మిగిలిన OS లకు లినక్స్ / యూనిక్స్ లకు తేడ ఏంటంటే ఇక్కడ డ్రైవ్లను drive letters (C,D,E లాంటివి) తో సూచించరు. అలా చేయడం వల్ల ఒక్క డ్రైవ్ ను ఒక్కో ట్రీ గా చూపించాల్సి వస్తుంది, అదే లినక్స్ లో ఒక ట్రీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. ఎన్ని డ్రైవ్ లు ఉన్నా అవి ఇందులోనే అమరిపోతాయి. అందువల్ల ఒక డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీ కి వెళ్ళడం చాలా సులువవుతుంది.
- ఇప్పుడు మనం ఉన్న డైరెక్టరీ ఏదో తెలుసుకోవాలంటే కమాండ్ చుద్దాం. మనం ఇప్పుడు ఉన్న డైరెక్టరీని working directory అంటాం.
కమాండ్: pwd ( present working directory )
ఈ కమాండ్ వల్ల మనం ప్రస్తుతం పని చేస్తున్న డైరెక్టరీ ఏదో తెలుసుకోవచ్చు. ఈ క్రింది బొమ్మను చూడగలరు.
[me@linuxbox me]$ pwd
/home/me
- ఇప్పుడు ఉన్న డైరెక్టరీలో ఫైల్స్ చూడాలంటే కమాండ్ చుద్దాం.
కమాండ్: ls
ఈ కమాండ్ ద్వారా మన డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని చూడొచ్చు. ఈ కమాండ్ కి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయ్. ఒక కమాండ్ పేరు తెలిస్తే దాని ఆప్షన్స్, దాని గురించి మిగతా సమాచారం ఎలా తెలుసుకోవాలో చివరిలో చూద్దాం.
[me@linuxbox me]$ lsDesktop Xrootenv.0 linuxcmd
GNUstep bin nedit.rpm
GUILG00.GZ hitni123.jpg nsmail
- ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలంటే కమాండ్ ఏదో చుద్దాం.
కమాండ్: cd ( change directory )
ఈ కమాండ్ మనం ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీ కి వెళ్ళాలంటే ఉపయోగపడుతుంది. ఈ క్రింది బొమ్మను గమనించండి.( ఇక్కడే cd తో పటు pwd, ls లను కూడా చుడవచ్చు. )
[me@linuxbox me]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
[me@linuxbox bin]$ lsAnimate import xfwp
AnotherLevel lbxproxy xg3
Audio listres xgal
Auto lndir xgammon
and many more...
అంటే మనం ఏ డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుంటున్నామో దాని దారి (path) cd పక్కన ఇస్తే సరిపోతుంది. ఇలా ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్ అంటారు.
ఇక్కడ దార్లను (path names) రెండు రకాలుగా విభజించారు.
ఇక్కడ దార్లను (path names) రెండు రకాలుగా విభజించారు.
- మొదటిది absolute path name. ఇక్కడ path root directory ( అంటే "/" ) నుండి మొదలవుతుంది.
- రెండవది relative path name. ఇక్కడ path working directory ( అంటే "." ) నుండి మొదలవుతుంది.
ఇక్కడ మనకు ఒక కొత్త గుర్తు కనిపించింది. " . " దీనినే dot operator అంటారు. dot ను ఉపయోగించటం :
- dot ను ఒకసారి వాడితే అది pwd ని సూచిస్తుంది.( అంటే " . " అని. దీనిని వాడక పోయిన పర్లేదు. మనం నేరుగా దారి ఇచేయోచ్చు )
- అదే రెండు సార్లు వాడితే అది పేరెంట్ డైరెక్టరీని సూచిస్తుంది. ( అంటే " .. ". దీనిని cd పక్కన ఆర్గ్యుమెంట్ గా చేరిస్తే పేరెంట్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది.
ఇప్పుడు మన ప్రస్తుత డైరెక్టరీ ని /usr/X11R6/ కి మార్చాలి అనుకుందాం. మనకు రెండూ మార్గాలున్నాయి. ఒకటి absolute path name ఉపయోగించడం. ఇంకోటి relative path name తో చేయడం. రెండూ చూద్దాం. మొదట absolute path name తో, అంటే root నుంచి మన దారి (path) ఏంటో చెప్తూ ఇచ్చే ఆర్గ్యుమెంట్.[me@linuxbox me]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
[me@linuxbox bin]$ cd /usr/X11R6
[me@linuxbox X11R6]$ pwd
/usr/X11R6
[me@linuxbox bin]$ cd ..
[me@linuxbox X11R6]$ pwd
/usr/X11R6
absolute path name తో..
[me@linuxbox X11R6]$ cd /usr/X11R6/bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
[me@linuxbox X11R6]$ cd ./bin
[me@linuxbox bin]$ pwd
/usr/X11R6/bin
మనం ఇంకో రెండు ముఖ్య విషయాలను చుద్దాం.
- cd పక్కన ఏమి ఇవ్వక పోతే అది మీ హోం డైరెక్టరీకి చేరుస్తుంది. ( ప్రతి యూజర్ కి ఇన్స్టలేషన్ సమయంలో ఒక హోం డైరెక్టరీ తయారు చేసి ఇవ్వబడుతుంది. అది మామూలుగా /home/
/ అయిఉంటుంది. అంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంచుకున్న మీ వినియోగదారునామం. - అదే మనం cd ~username ( ఇక్కడ user-name అంటే ఇంకొక యూసెర్ పేరు. ) అని ఇస్తే ఆ యూసెర్ యొక్క హోం డైరెక్టరీ కి మనల్ని చేరుస్తుంది. cd కి ఉత్తి ~ అని ఆర్గ్యుమెంట్ ఇస్తే (అంటే cd ~ అని ఇస్తే)మన హోం డైరెక్టరీ కి తీస్కుని వెళ్తుంది, ఏమీ ఇవ్వనట్టు.
Source: http://www.linuxcommand.org/lts0020.php © 2000-2009, William Shotts, Jr.
Subscribe to:
Posts (Atom)