Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Showing posts with label సొంత సైట్. Show all posts
Showing posts with label సొంత సైట్. Show all posts
సొంత వర్డుప్రెస్స్ సైటు లో థీమ్, ప్లగిన్లు పెట్టుకోవడం
04 November 2009Posted by
INDUSTAN
0 Comments
సొంత సైటు నిర్మాణానికి రాస్తున్న టపాలలో నాల్గవది.
మన "సొంతంగా ఒక సైట్ నిర్మించుకోవడం" అనే అంశంలో మూడు పోస్టులు చూశాము - సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?, సొంత సైట్ లో వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?,బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ. ఇప్పుడు వర్డుప్రెస్సు తో నిర్మించుకున్న సైట్ ని కొత్త అలంకారాలతో, ప్లగిన్లతో ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.
౧. థీమ్ లు/అలంకారాలు
అసలు అలంకారం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే మన వేస్కునే బట్టలు లాంటివే ఈ అలంకారాలు. పంచె, సూట్, లంగోటా ఇలా రకరకాలుగా ఉన్న బట్టల్లో మనం రకరకాలుగా కనబడ్డట్టే, ఒక్కొక్క అలంకారానికి సైట్ కి ఒక్కో రూపం వస్తుంది, ఉదాహరణకి వంటల బ్లాగో, కామర్స్ బ్లాగో మొదలెడితే, వాటికి తగ్గ బొమ్మలు, డిజైన్ ఉన్న అలంకారం ఎంచుకోవాలి. ఇప్పుడు అలాంటి అలమ్కారాల్ని ఎక్కడ పట్టాలో, పట్టి మన సైట్ లో ఎలా పెట్టాలో చూద్దాం.
- ఈ లంకెకు వెళ్లి, కావాల్సిన విషయానికి తగ్గ అలంకారాన్ని ఎంచుకోండి. అది దింపుకుని ఆ వచ్చిన జిప్ ఫైల్ ని ఎక్కడైనా విప్పండి(అన్జిప్ చేయమని).
- అలా విప్పగా వచ్చిన ఫోల్డర్ ని మీరు వర్డుప్రెస్సు సైట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసారో, అక్కడ wp-content అనే ఫోల్డర్ లో themes అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
- ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు(అడ్మిన్ పానెల్) కి వెళ్ళండి. అక్కడ పక్కపట్టీ లో కనిపించు/Appearence లో అలంకారాలు/Themes అని ఉంటుంది. అది నొక్కితే, మీరు ఇందాక పెట్టిన అలంకారం అక్కడ కనిపిస్తుంది. ఆ అలంకారాన్ని Activate చేస్తే మీ సైట్ రూపు ఆ అలంకారానికి మారిపోతుంది.
- ఆ అలంకారం లో అన్నీ నచ్చి, ఒకటీ రెండు చోట్ల మార్పూ కావాలి అనుకుంటే మీకు CSS పరిజ్ఞానం కావాలి (టెక్ సేతు లో దాని పై కూడా పాఠ్యాంశాలు వస్తాయి). మీకు కొద్దో కొప్పో తెలుసనే అనుకుంటే ఆ అలంకారానికి సంబందించిన సమాచారం అంతా మీరు ఇందాక themes ఫోల్డర్ లో పెట్టిన ఆ అలంకారం ఫోల్డర్ లోనే ఉంటాయి. చాలా వరకు ఆ అలంకారం కూర్పులు, చేర్పులు style.css ఫైల్ లోనే నిక్షిప్తమయ్యి ఉంటాయి.
౨. ప్లగిన్లు/పొడిగింతలు
అలంకారం హంగుకి, ఆర్భాటానికి ఐతే పొడిగింతలు సైట్ పనితనానికి, అంటే మీరు రూపు రేఖల్లో కాకుండా సైట్ లో కొత్తగా ఎమన్నా చేర్చాలనుకుంటే ఆ పని చేసేవే పొడిగింతలు. ఉదాహరణకి మీ సైట్ ని శోధన యంత్రాల్లో బాగా కనిపించేలా చేయాలన్నా, మీరు రాసినా టపాల్లో కొన్ని నియమాల్ని అనుసరించి కొన్ని పోస్టులనే ఎంచి అవి పాఠకులకి చుపించాలన్నా, అసలు ఇఅంటి పనులు ఏం చేయాలన్నా మనకు పొడిగింతలు అవసరం. అవి ఎక్కడ సంపాదించి ఎలా ఉపయోగించాలో చూద్దాం.
- ఈ లంకెకు వెళ్లి, మీకు కావాల్సిన పనికి సంబందించిన పదాలతో వెతికితే కొన్ని ఫలితాలొస్తాయి. అందులోంచి మీకు నచ్చినది ఎంచుకుని దించుకోండి.
- ఆ దించిన జిప్ ఫైల్ ని విప్పి మీరు వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసిన చోట, wp-content అనే ఫోల్డర్ లో plugins ఫోల్డర్ ఉంటుంది. అందులో పెట్టండి.
- ఇప్పుడు మీ వర్డుప్రెస్సు డాష్ బోర్డు కి వెళ్లి, పక్కపట్టీలో Plugins అని ఉంటుంది. అది నొక్కితే ఇందాక మీరు పెట్టిన ఆ పొడిగింతని చూపిస్తుంది. దాన్ని Activate చేస్తే ఇంకా వాడుకోవచ్చు. పొడిగింత ఎలా వాడుకోవాలో మీరు అది దించుకున్న పేజీలోనే ఉంటుంది.
ఒకవేళ మీకు కావాల్సిన పొడిగింత దొరకకపోతే, మీరే అది తాయారు చేసుకోవచ్చు. కాకపోతే దానికి PHP పరిజ్ఞానం అవసరం అవుతుంది (టెక్ సేతు లో భవిష్యత్ లో వీటి మీద కూడా పాఠ్యాంశాలుంటాయి). తర్వాతి టపాలో, ప్రతి సైట్ కి కావాల్సిన ముఖ్యమైన పొడిగింతల జాబితా చూసి అవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. దృపాల్ లో సైట్ నిర్మాణం కూడా మొదలుపెడదాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
సొంత సైట్ కావాలనుకుంటే ?
Posted by
INDUSTAN
సొంత సైట్ కోసం మనం చేయాల్సినవి మూడు పనులు.
సైట్ పేరు ఎంచుకోవడం
సైట్ పేరుని డొమైన్ లేదా సీమనామము అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి. తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు. స్వచ్చంద సంస్థల వంటివాటికి .org బావుంటుంది. సమాచారం అందరికి పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో వాడుతున్నట్టేమి కనబడట్లేదు. కానీ, సైట్ అంటే .com యేనని మనసులో ముద్రపడిపోయింది చాలా మందికి. ఇప్పుడిప్పుడే అంతర్జాలం విస్తరిస్తున్న పల్లెల్లో ఈ భావన ఎక్కువ. కాబట్టి మీ సైట్ కి వచ్చేవారు ఎవరు అనేదాన్నిబట్టి కూడా చూసుకోవాలి.ఆ పేరు రిజిస్టర్ చేయడం
ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి హోస్ట్.ac, గో డాడీ, రిజిస్టర్.కాం చూడండి. మిగతా వాటి కోసం గూగుల్ ని అడిగితే సరి. ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.జాల జాగా కొనుక్కోవడం
ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి ఒక జాగా లేదా ఆవాసం కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో, వాళ్ళ దగ్గరే ఆవాసం కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణ కి g33k హోస్టింగ్, బ్లూ హోస్ట్, హోస్ట్.ac లాంటి ఆవాసదాతల్ని చూడండి.ఇప్పుడు పేరూ, జాగా సిద్ధం! తర్వాత ఏం చేయాలో వచ్చే టపాలో చూద్దాం!!
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
Subscribe to:
Posts (Atom)

