టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
జి నోమ్ షెడ్యూల్ - అలారాలు - మర్చిపోవడం మర్చిపోండి!
16 November 2009
గువేక్ - గ్నోమ్ లో యాకువేక్
sudo apt-get install guake
లినక్సులో FFMPEG
09 November 2009
ఇంతకు ముందు ఒక పోస్టులో FFMPEG విండోస్ లో ఎంత సులువుగా ఉపయోగించవచ్చో చూశాము. ఇప్పుడు, లినక్సు లో FFMPG గురించి వివరాతి వివరంగా తెలుసుకుందాం.1. ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలి?
లినక్స్ లో వచ్చే చిక్కేంటంటే, రకరకాల లినక్సు లు ఉండి, దేనికి దానికే ఒక్కో పద్దతి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ పని చేసేలా ఒక పద్దతి చెప్తాను, చేసెయ్యండి! ముందు, ఈ క్రింది చెప్పిన లైబ్రరీ లు అన్నీ ఇన్స్టాల్ చేస్కోవాలి. మీరు వాడే లినక్సులో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్కొడానికి ఒక ప్యాకేజీ మేనేజర్ ఉంటుంది (ఫెడోరా ఐతే యమ్, ఉబుంటు ఐతే సినాప్టిక్/అప్ట్-గెట్) దానిలో ఈ క్రింది పదాలతో శోదించి, ఆ వచ్చిన ఫలితాల్లో, ఆయా పేర్లతో ఉన్న ప్యాకేజీ లను, వాటి డెవలప్మెంట్ ప్యాకేజీ లను ఇన్స్టాల్ చేసెయ్యండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజీ మేనేజర్ లు వాడటం తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
liba52
libgsm
libxvid
libamr
libmp3lame
libogg
libvorbis
libfaac
libfaad
libx264
tar -xvf ffmpeg-0.5.tar.bz2
cd ffmpeg-0.5
./configure --enable-gpl --enable-libfaac --enable-libfaad --enable-libgsm --enable-libmp3lame --enable-libtheora --enable-libvorbis --enable-nonfree --enable-shared --enable-x11grab --enable-libx264 --enable-libxvid --enable-pthreads --enable-libopenjpeg --enable-swscale
make
make install
ffmpeg -sameq -ss 00:02:00 -t 00:01:00 -i sample.mp3 sample.wav
లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
చాలా మంది విండోస్ లో ప్యాకేజీలు ఇన్‌స్టాల్ చేస్కోవడానికి అలవాటు పడి, లినక్సుకి వచ్చేసరికి, కొంచెం తేడాగా ఉండే సరికి, కష్టమేమో అని గాబరాపడిపోతారు. కాని, అది ఒఠ్ఠి భయం మాత్రమే. ఈ పాఠ్యాంశంలో ఉబుంటు, ఫెడోరాలలో కొత్త పాకేజీలు ఎలా ఇన్‌స్టాల్ చేస్కోవాలో చూద్దాం.
ఉబుంటు ఐతే
ఉబుంటు లో మొత్తం మూడు పద్దతుల్లో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. ఒక్కక్కటి చూద్దాం. ముందు మనం, ప్రాధమికంగా సిస్టం ని ప్యాకేజీ లు తెచ్చుకునే విధంగా సెటప్ చేస్కోవాలి. ఉబుంటు ఇన్స్టాల్ చేసిన కొత్తలో, ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లని తీసెయ్యడం తప్పితే కొత్త అప్లికేషనులు తెచ్చుకోవడానికి ఉండదు. కానీ, మనం కొన్ని సోర్సులు కలిపితే ఆ సౌలభ్యం కల్పించుకున్నవారమవుతాం. దానికి ఇలా చేయాలి.System లో Administration లో Synaptic Package Manager ఉంటుంది. దాన్ని తెరవండి. అది ఇలా బొమ్మలో లాగా ఉంటుంది.
ఒకవేళ మీకు మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినవారు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చివుంటే ఈ స్టెప్ లో ఉన్నది చెయ్యండి. లేదంటే ఈ స్టెప్ అవసరం లేదు. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లో పైన మెనూ లో Settings లో Preferences నొక్కితే, ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా. అందులో, Network ట్యాబు కి వెళ్లి, అక్కడ మీ ప్రాక్సి వివరాలు ఇచ్చేయండి.
ఇక సెటప్ పూర్తయ్యినట్టే! ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేయడం అరటిపండు ఒలిచి నోటి దగ్గర పెడితే తిన్నట్టే ఉంటుంది.
౧. సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్
ఇప్పటి దాకా, మనం పైన చెప్పుకున్న సెటప్ అంతా చేసింది ఇందులోనే. దీన్ని తెరవడానికి, System లో Administration లో ఉన్న Synaptic Package Manager ని క్లిక్ చేయాలి. ఇందులో, పైన ఒక శోధన బాక్స్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన పదాలతో వెతికితే ఫలితాలు చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి. mplayer అని వెతికితే వచ్చిన ఫలితాలవి. ఫలితాలు వచ్చాక, అందులో మనకు కావాల్సిన ప్యాకేజీ పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే, Mark for Installation అని చూపిస్తుంది. అది కొట్టాలి. ఒకవేళ మీరు కోరుకున్న ప్యాకేజీ కోసం ఇంకేమన్నా ప్యాకేజీ లు తేవాలి అంటే అది మీకు చెప్తుంది, సరేనని కొట్టేయ్యండి. అన్నీ మార్క్ చేసాక,సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో పైన Apply అని ఉంటుంది. అది కొడితే, ఎన్ని ప్యాకేజీ లు మార్క్ చేసారు, ఎంత డౌన్లోడ్ చేయాలి, ఎంత నిలువ ఆక్రమిస్తుంది లాంటి వివరాలన్నీ చూపిస్తుంది. సరేనని కొట్టేస్తే ఇన్స్టాల్ చేసేస్తుంది.
౨. ఆడ్/రిమూవ్ అప్లికేషను
ఇది కూడా సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ లాంటిదే. కాకపోతే ఇందులో అక్కడ ఉన్నన్ని అమరికలు ఉండవు. కాస్త తేలిగ్గా ఉంటుంది. దీన్ని తెరవాలంటే, మెయిన్ మెనూ లో, Add/Remove Applications ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ప్యాకేజీ వెతుక్కుని టిక్ చేసి, క్రింద Apply అని ఉంటుంది, దాన్ని కొడితే ఇన్స్టాల్ చేసేస్తుంది.
. అప్ట్-గెట్
ఇక టెర్మినల్ ని ప్రాణప్రదంగా చుస్కునే వారికి ఎప్పుడు లోటు చెయ్యదు లినక్సు! మనం మొదట్లో కొన్ని సోర్సులు కలిపాం చూసారు? అవి ఇక్కడ కూడా కలపొచ్చు. ఎలా అంటే, ముందు ఒక టెర్మినల్ తెరిచి పెట్టుకోండి. ఇక క్రింది కంమాండ్లు ఏమేం చేస్తాయో చూడండి.
ls -R /etc/apt//etc/apt డైరెక్టరీ లో మన ప్యాకేజీ మేనేజర్ల వివరాలన్నీ ఉంటాయి.ఆ పై కమాండ్ ఆ డైరెక్టరీ లో ఉన్నవన్నీ చూపిస్తుంది. ఉదాహరణకి, అందులో, /etc/apt/sources.list, /etc/apt/sources.list.d/ లో ఉన్న ఇంకో ఫైల్, రెంటినీ చూడండి. మనం ఇందాక పైన కలిపిన సోర్సులు ఇక్కడ కనబడతాయి. మనం ఇక్కడే కలుపుకోవచ్చు కూడాను. లైన్ కి ముందు deb ఉంటే అది ఒక సోర్సు కి సంబంధించిన లైన్ అని గుర్తించాలి. ఒకవేళ # ఉంటే అది ప్రస్తుతానికి వాడకం లేదని గుర్తిచాలి. ఒకవేళ మీరు దాన్ని వాడాలి అంటే ఆ # ని తీసెయ్యాలి.
ఇప్పుడు ఒక కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఒక కమాండ్ తో పని అంటే! ఉదాహరణకి మనం mplayer ఇన్స్టాల్ చేస్కోవాలి అనుకుందాం.
sudo apt-get install mplayerఅని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఒక ప్యాకేజీ ని తీసెయ్యాలి అంటే,
sudo apt-get remove mplayerఅంటే సరిపోతుంది. మీకు ప్యాకేజీ పేరు తెలియకపోతే, ఈ క్రింది కమాండ్ తో శోధించవచ్చు.
sudo apt-cache search mplayerఇంక చెలరేగిపొండి. మీకు అడ్డే లేదు :)
ఫెడోరా ఐతే:
ఏ మాటకి ఆ మాటేనండి! ఉబుంటు లో ఉన్నంత సౌలభ్యం ఇందులో ఉండదు, గత ౫ ఏళ్లుగా చూస్తున్నా సరే, ఉబుంటు కి ఉన్న సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ కి సరితూగగల ప్యాకేజీ మేనేజర్ ఇందులో కానరాలేదు! అలా అని డీలా పడిపోకండి మరి. ఇందులో yum అనే ఒక అద్భుతమైన సాధనం ఉంది. కాకపోతే ఇది టెర్మినల్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో అసలు గ్రాఫిక్స్ అప్లికేషను ఏ లేదని కాదు, ఉన్నా సరే, దానితో సవా లక్ష సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పటికి చాలా మంది ఆన్ లైన్ ఫోరం లలో, వీటి గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. కాబట్టి, అన్నిటికంటే మంచి పద్దతి, మనకేమన్నా కోర్కేలుంటే వాటిని కాసేపు చంపుకుని, yum ని వాడుకోవడమే. మీరు ససేమిరా మేము వాడము, మాకు గ్రాఫిక్స్ విండో కావాలి అంటే, విక్రమార్కులు మరి మిమ్మల్ని ఆపగలమా, అలాగే కానివ్వండి - మెయిన్ మెనూ లో Add/Remove Softwares అని ఉంటుంది, అది నొక్కితే ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది బొమ్మలో లాగా, ఇంక మీ తిప్పలు మీరు పడండి :) Yum వాడతానన్నవాళ్ళు మాత్రం ఇంకా చదవి సుఖపడండి :)ఒక టెర్మినల్ తెరిచి, ఈ క్రింది కమాండ్ కొట్టండి, ఒక ఫైల్ తెరుచుకుంటుంది.
su -c 'vim /etc/yum.conf'ఒకవేళ, మీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చినవారు, మీకు ప్రాక్సి సర్వర్ వివరాలు ఇచ్చి ఉంటే, వాటిని ఈ క్రింది ఫార్మటు లో ఆ ఫైల్ లో ఒక లైన్ గా పెట్టాలి.
proxy=http://192.34.35.11:3128అంటే, URL:port ఫార్మటు అన్న మాట.
ఇక ఆ ఫైల్ ని సేవ్ చేసేసి (ఎస్కేప్ కొట్టి, : కొట్టి, wq కొట్టండి), ఈ క్రింది కమాండ్ కొట్టండి.
ls /etc/yum.repos.dఅక్కడ, మీకు డీఫాల్ట్ గా వచ్చిన రిపాసిటరిలు అన్నీ కనిపిస్తాయి. అందులో మచ్చుకకి ఒక ఫైల్ తెరవండి, క్రింది కమాండ్ తో (ఫైల్ పేరు మార్చుకోండి, ఆ డైరెక్టరీ లో ఏమేమి ఫైళ్లు ఉన్నాయో చూసి)
su -c "vim /etc/yum.repos.d/livna.repo"ఆ ఫైల్ లో ఈ క్రింది ఉన్న లైన్ ఉందేమో చూడండి.
enabled = 0అలా ఉంటే, ఆ రిపాసిటరి ఉపయోగించబడటం లేదు. ఉపయోగించాలంటే, దాన్ని ఈ క్రింది విధంగా మార్చాలి.
enabled = 1ఫెడోరా కి కావాల్సిన చాలా ప్యాకేజీ లు, లివ్నా అనే ఒక రిపాసిటరీ లో ఉంటాయి. అది సెటప్ చేస్కోవడానికి, ఈ క్రింది కమాండ్లు కొట్టండి.
wget -c http://rpm.livna.org/livna-release.rpmఇక అలా, మీకు నచ్చిన రిపాసిటరీలు అన్నీ సరి చేస్కుకున్నాక, ఇక ఇన్స్టాల్ చేస్కోవడం తేలికే. ఉదాహరణకి, mplayer ఇన్స్టాల్ చేస్కుందాం.
rpm -ivh livna-release.rpm
yum -y install mplayerఅని కొడితే సరిపోతుంది. ఒకవేళ ఆ ప్యాకేజీ ని తీసెయ్యాలి అనుకుంటే,
yum remove mplayerఅంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్యాకేజీ పేరు తెలియక వెతకాలి అనుకుంటే,
yum search video playerఅంటే అదే వెతికి, మీకు ఫలితాల్ని అందిస్తుంది.
మీకు ఇంక ఏమన్నా సందేహాలుంటే అడగండి.
నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు

మనం రోజూ లినక్‌స్‌లో చేసే పనులకు కావలసిన సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది. వీటిని (వీటిలో కొన్నింటిని) ఇంస్టాల్ చేసుకొంటే సాధారణ వాడుకరులకు కావలసిన అన్ని పనులూ చేసుకోవచ్చు.
సాధారణంగా వాడే లినక్స్ ఉబుంటు. ఆర్డర్ చేస్తే ఉచితంగా ఇంటికి సీడీ పంపుతారు. కానీ ఇది ఇంస్టాల్ చేసుకున్న తరువాత ఇందులో మనకు అవసరమైయ్యే సాఫ్ట్వేర్లు ఉండవు. వాటిని ఇంస్టాల్ చేసుకోవాలి.
మనకు నిత్యం అవసరమైయ్యే సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది.
కేవలం ఉబుంటు లినక్సుకు మాత్రమే కాదు ఈ సాఫ్ట్వేర్లు అన్ని లినక్సులకూ పనిచేస్తాయి. అన్నీ ఉచితంగా లభిస్తాయి.
క్రింది జాబితాలో అన్నీ ఇంస్టాల్ చేసుకోనవసరం లేదు, మీరు తరచూ వాడే సాఫ్ట్వేర్‌ల జాబితాలోకి వచ్చే వాటిని వాడితే సరిపోతుంది.
ఇంటెర్‌నెట్ :
1. బ్రౌజర్ : ఫైర్ ఫాక్‌స్.
2. ఫైర్ ఫాక్‌స్ యాడ్-ఆన్‌లు మరియూ ఎక్‌స్టెన్‌షన్‌లు (Firefox addons) : పద్మా (Padma), ఎక్స్-మార్క్స్ (Xmarks), ఆంసర్స్ (Answers), స్టంబుల్ అపాన్ (Stumblw-Upon), కూల్-ఐరిస్ (Cooliris), ఫ్లాష్ సపోర్ట్
3. డౌంలోడ్ మ్యానేజర్: డీ4ఎక్స్ (D4X), జి.డబ్లూ.గెట్ (gwget)
4. ఇంస్టంట్ మెసెంజర్ (చాటింగ్): పిజియన్ (pidgin), స్కైప్ (skype)
5. టోరెంట్ క్లైంట్ : కె-టోరెంట్ (kTorrent), వూజ్ (vuze)
6. మరి కొన్ని : గూగుల్ అర్‌థ్ (Google Earth), పికాసా (Picasa)
ఆడియో వీడియో :
1. వీడియో : వీ.ఎల్.సి (VLC), ఎస్.ఎం.ప్లేయర్ (SMPlayer), టోటెం ప్లేయర్(Totem Player), మిథ్‌టీవీ (mythtv).
2. పాటల కోసం : అమెరాక్ (Amarok), సాంగ్ బర్డ్ (Song Bird).
3. వీడియో కన్‌వర్టర్‌లు : ఇరివర్‌టర్ (iriverter).
4. అడియో కన్‌వర్టర్‌లు : సౌండ్ కన్‌వర్టర్ (sound converter).
5. డెస్‌క్‌టాప్ రికార్డర్ : రికార్డ్ డెస్‌క్‌టాప్ (recorddesktop).
తక్కినవి :
భాషలు : తెలుగుతో పాటుగా కావలసిన ఇతర భాషలు.
సాఫ్ట్వేర్ ఇంస్టాలర్‌లు : వైన్ (Wine), సినాప్‌టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(Synaptic Package Manager), ఏలియన్ (alien).
ఆఫీస్ టూల్‌స్ : ఓపెన్ ఆఫీస్ (Open Office).
సీడీ డీవీడీ బర్నర్ : కె3బి (K3b).
ఆటలు : పింగూస్ (pingus), జీయల్-117 (gl-117), జియల్‌ట్రాన్ (gltron).
మల్టీ మీడియా : జింప్ (Gimp), చీస్ (cheese) - వెబ్ క్యాం ఉన్నవారికి మాత్రమే.
డెస్‌క్‌టాప్ అపియరెంస్ : కాంపిజ్-కాంఫిగ్-సెట్టింగ్-మ్యానేజర్ (ccsm), స్క్రీన్‌లెట్‌స్ (screenlets), వాల్‌పేపర్ ట్రే (wallpaper-tray), ఎమెరాల్‌డ్ (Emerald).
నెట్వర్కింగ్ : ఓపెన్ ఎస్‌ఎస్‌ఎచ్ క్లైంటు మరియూ సర్వర్ (openssh client and server), డీ.సీ.ప్లస్‌ప్లస్ (DC++), కే.డీ.ఈ.బ్లూటూత్ (kdebluetooth).
ప్రోగ్రామింగ్ : క్వాంటా ప్లస్ (Quanta Plus), బిల్‌డ్-ఎసెన్షియల్ (Build-essential), మై-ఎస్‌క్యూఎల్(MySQL), అంబ్రెల్లో (Umbrello), అప్యాచీ (Apache), జిసిసి (gcc), యాక్యుయేక్ (yakuake).
వర్చువల్ మెషిన్ : వర్చువల్ బాక్‌స్ (VirtualBox).
డిస్క్ టూల్స్ : ఎన్‌టీఎఫ్‌ఎస్-కాన్‌ఫిగ్ (ntfs-config)
టెర్మినల్ అనగా ఏమిటి?
29 August 2009
టెర్మినల్ని కన్సోల్ అని కూడా అనవచ్చు. లినక్స్ లో ప్రతి పనినీ చెయ్యటానికి దీనిని వాడవచ్చు. ఇందులో ఒక్కొక్క పనికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమాండ్లను కలిపి వాడవలసి ఉంటుంది.
టెర్మినల్ని తెరవటం ఎలా?
Alt + F2 నొక్కగానే ఒక చిన్న విండొ వస్తుంది. అక్కడ gnome-terminal అని టైప్ చేసి Enter నొక్కండి, టెర్మినల్ తెరుచుకుంటుంది.
ఉదాహరణ :
మౌస్ తో లేదా గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్(GUI) తో చేసే ప్రతి పనీ ఇందులో చెయ్యవచ్చు. కొన్ని పనులు పదే పదే చేయవలసిన అవసరం ఉంటుంది, వీటిని సునాయాసంగా టెర్మినల్ కమాండ్ల తో చెయ్యవచ్చు.
ఉదాహరణకు మీ కంప్యూటర్‌లో చిందరవందరగా ఏ డ్రైవ్‌లో అంటే ఆ డ్రైవ్‌లో పడి ఉన్న పాటలన్నింటినీ లేదా ఫోటోలన్నింటినీ ఒకే చోటకు చేర్చాలి. మామూలుగా చేస్తే దీనికి చాలా సమయం పడుతుంది (2 లేదా 3 గంటలు).
అదే టెర్మినల్ సాయంతో మన ప్రమేయం లేకుండా, దానంతటదే మన పాటలన్నింటినీ 10నిమిషాల్లో ఒకే చోటికి చేరుస్తుంది. ఇలా మనం ఊహించగలిగినది ఏదైనా చేయవచ్చు.
లినక్స్ లో శాశ్వతంగా డ్రైవ్ లను మౌంట్ చేయటం ఎలా?

NTFS Config ( యన్.టీ.ఎఫ్.ఎస్ కాన్‌ఫిగ్ ) అనే సాఫ్ట్వేర్‌ని ఇంస్టాల్ చేసుకుంటే అది మీ డ్రైవ్‌లను చూపుతుంది, ఏవైతే డీఫాల్‌ట్‌గా మౌంట్ కావాలనుకొంటున్నారో వాటిని ఎంచుకోండి.
ఒక వేళ మీ కంప్యూటర్‌లో విండోస్ కూడా ఉంటే, విండోస్‌ని సరిగ్గా షట్‌డౌన్ చేయటం మరవకండి.
మీరు ఒక వేళ NTFS Configను ఏ కారణంగా ఐనా ఇంస్టాల్ చేసుకోలేకపోతే క్రింది ప్రక్రియను పాటించండి.
కమ్యాండ్‌ల ద్వారా :
మీరు ఈ ప్రక్రియను పాటించటానికి ముందు మీరు మీ డ్రైవులన్నింటినీ మౌంట్ చేసుకోవాలి.
1. అవి ఏ పేరుతో మౌంట్ అవుతున్నాయో గమనించండి, ఇవి చూడటానికి మీరు క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేస్తే వాటి పేర్లు చూపుతుంది.
ls /media/
చూపిన పేర్లను నోట్ చేసుకోండి. (గమనిక : Disk అన్నదానికీ disk అన్నదానికీ తేడా ఉంది.)
2. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే ఒక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.
gedit /etc/mtab
మీరు ఏ డ్రైవులనైతే మౌంట్ చేశారో, వాటికి సంభందించిన లైంలు క్రింద తెలిపిన విదంగా ఉంటాయి.
/dev/sda6 /media/disk fuseblk rw,nosuid,nodev,uhelper=hal,shortname=mixed,uid=1000,utf8,umask=077,flush 0 0
చివరిలో ఉన్న ఇలాంటి లైన్లు అన్నింటినీ కాపీ చేసుకోండి. ఆ ఓపెన్ ఐన ఫైల్ను మూసివేయండి.
3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే వేరొక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.
sudo gedit /etc/fstab
ఇందులో చివరిలో మీరు కాపీ చేసుకున్న లైంలను పేస్ట్ చేయండి.(Enter నొక్కిన తరువాత కొత్త లైనులో పేస్టు చేయాలి)
ఒక వేళ fuseblk అని ఎక్కడైనా కనబడితే, దాన్ని ntfsగా మార్చండి.
Save చేసి దీనిని మూసివేయండి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
పొరపాటుగా విండోస్ ను(ఒక వేళ మీ కంప్యూటర్లో ఉంటే) సరిగా Shutdown చేయనట్టైతే చిక్కుల్లో పడతారు. దీనికి పరిష్కారం క్రింద తెలిపిన ప్రక్రియను జాగ్రత్తగా పాటిస్తే చాలు.
1. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయండి. అన్ని డ్రైవులూ unmount అవుతాయి. ఇలా చేసేటప్పుడు ఏ డ్రైవునుంటి కూడా ఫైల్లను వాడుతూ ఉండరాదు. అంటే పాటలు సినిమాలూ ఇలాంటివి అన్నమాట.(అవి ఈ డ్రైవుల్లో ఉంటేనే).
sudo umount -a
2. ఇప్పుడు, క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో ఒక్కొక్క డ్రైవ్ కూ ఒక్కొక్క సారి వాడవలసి ఉంటుంది.
sudo mkdir /media/disk —- ఇక్కడ disk అన్నది డ్రైవ్ పేరు. ఇలా ప్రతి డ్రవ్ కూ చేయాలి( disk అని ఉన్న స్థానంలో మీరు ls /media/ అన్న కమాండ్ నుంటీ నోట్ చేసుకున్నారు కదా! ఆ పేర్లు ఒక్కొక్కటిగా వాడండి ).
ఉదాహరణకు :
sudo mkdir /media/fun
sudo mkdir /media/Videos
3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే అన్ని డ్రైవ్ లనూ మౌంట్ చేస్తుంది.
sudo mount -a
ఇక మీరు ఎప్పుడు కంప్యూటర్ను స్టార్టు చేసినా అన్ని డ్రైవులూ వాటంతటవే మౌంటు అవుతాయి. ఒక వేళ అవ్వకపోతే(ఇలా జరగటం చాలా అరుదు), రీస్టార్టు చేయండి, లేదా sudo mount -a కమాండును వాడి చూడండి.
లినక్స్ లో తెలుగు టైప్ చేయడం

ఇహ విషయానికొస్తే, టైప్ చేయడంలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి, ఇన్‌స్క్రిప్ట్(inscript), ఇంకోటి లిప్యంతరీకరణం(transliteration).
ఇన్‌స్క్రిప్ట్ అంటే సరాసరి తెలుగు కీబోర్డ్ మీద టైప్ చేసినట్టు చేసేయడం. లిప్యంతరీకరణం అంటే మనం ఇంగ్లీషులిపిలో తెలుగు టైప్ చేస్తే అది తెలుగులిపిలోకి మారడం. అంటే మనం amma అన్ని టైప్ చెస్తే అది అమ్మ గా మారుతుందన్నమాట. మీకు ఏది తేలికనిపిస్తే అదే ఉపయోగించమని నేను చెప్పక్కర్లేదనుకుంటా.
ఇన్‌స్క్రిప్ట్(Inscript)
KDE లో ఐతే
- System Settings లో Regional & Language ని వెతికి పట్టుకోండి(అంటే అక్కడో search బాక్సుంటుంది, ఉపయోగించమని).
- అందులో Keyboard Layout అనే దాంట్లోకి వెళ్ళి, Enable keyboard layouts అన్నదాన్ని టిక్ చేయండి.
- దాని కిందే, Available layouts అని ఉంటుంది, దాంట్లో India ని ఎంచుకుని Add బటన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు పైన కొత్తగా చెర్చిన India ని ఎంచుకుని Layout variant కి tel అని ఎంచుకోండి.
- చివరిగా Apply బటన్ కొట్టేశక మీకు ప్యానల్‌లోlayout బటన్ ఒకటి కనిపిస్తుంది. క్లిక్ చేసినప్పుడల్లా layout మారుతుందన్నమాట.
Gnome లో ఐతే
కింద చెప్పిన లిప్యంతరీకరణం పద్దతితోనే ఇన్‌స్క్రిప్ట్ టైప్ చేయడానికి కూడా వీలు కలుగుతుంది. దీని కోసం వేరేగా ఇంకోటి చేసే బదులు ఇన్‌స్క్రిప్ట్ కి కూడా అదే ఉపయోగించుకోవడం మేలని నా అభిప్రాయం. ఇది KDE కి కూడా ఉపయోగపడుతుందనుకోండి.
లిప్యంతరీకరణ(Transliteration)
ఈ పాఠ్యాంశం రాసింది ఈ పద్దతిలోనే.ఇంగ్లీషు కీ-బోర్డ్ కి అలవాటు పడి, నాకిది సులువనిపిస్తుంది. కాని మీరు టైపింగ్ కి కొత్త ఐతే మాత్రం నేను ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోమని ప్రోత్సహిస్తాను. ఇక లిప్యంతరీకరణ(transliteration) ఉపయోగించాలంటే, మనకి SCIM అనే పరికరం కావాలి. దీంతో లిప్యంతరీకరణం పద్దతే కాకుండా, ఇన్‌స్క్రిప్ట్ మరియు Phonetic పద్దతిలో కూడా టైప్ చేసే వీలుంటుంది.ఇప్పటి వరకూ వచ్చిన complex script input సాఫ్ట్వేర్ పరికరాల్లోకెల్లా అత్యున్నతమైంది, ఈ SCIM. అందుకే నాకిదంటే భలే ఇష్టం. ఇది మీక్కూడా కావాలి అంటె ఇలా చేయాలి.
ఫెడోరా(Fedora) వాడేవారైతే
ఈ క్రింది కమాండ్ టర్మినల్ తెరిచి రన్ చేయండి.
yum -y install scim scim-devel scim-m17n m17n-contrib-telugu.noarch m17n-db-telugu.noarch scim-lang-telugu
ఆ తర్వాత
- Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
- ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
- ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.
ఈ సారి లాగిన్ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. ఇంక దంచేయొచ్చు!
ఉబుంటు(Ubuntu) వాడేవారైతే
- Gnome లో System>Administration లో Language Support అని ఏదైనా ఉందేమో చూడండి.
- ఉంటే కేక – ఉన్నట్లైతే,
- అది క్లిక్ చేసి, వచ్చిన విండోలో తెలుగు ని టిక్ చేసి, కింద Enable support to enter complex characters అని ఉన్నదాన్ని కూడా టిక్ చేసేయ్యండి.
- అదేవో కొన్ని ప్యాకేజ్ లు దించుకుని స్థాపించుకుంటుంది, చేసుకోనివ్వండి.
- అది అయ్యాక ఒకసారి కంప్యూటర్ ని రీబూట్ చేస్తే ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది
- ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. కుమ్మేయండి!
- లేకపోయినా బాధపడక్కర్లేదు.
- ఆ Language Support Option లేని వాళ్ళు ఈ కింద చెప్పిన కమాండ్ ని రన్ చేయండి(అంటే : Alt+F2 కొట్టి, gnome-terminal అని టైప్ చేసి Run చేయండి, ఆ వచ్చిన విండో లో ఈ కింద చెప్పిన కమాండ్ ని కాపీ చేసి, అతికించి Enter కొట్టండి.)
- sudo apt-get install scim scim-m17n scim-tables-additional
- ఆ తర్వాత Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
- ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
- ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.
- ఈ సారి లాగిన్ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. టైప్ చేయడం మొదలెట్టొచ్చు!
చివరిగా, తరచూ అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు వాడేవారికి సౌలభ్యంగా ఉండటం కోసం, ఒక చిన్న చిట్కా.. తెలుగు, ఇంగ్లీషు ఒక చిన్న shortcut తో మార్చి మార్చి వాడుకోవచ్చు. ఎలాగంటే, టెర్మినల్ తెరిచి ఈ కిందున్న command ని run చేయండి.
gopal@tidbits# im-switch -z en_US -s scim
ఆ తర్వాత ఒక్కసారి logout అయ్యి, login అయితే ఏ అప్లికేషన్ లో ఐనా Ctrl+Space తో తెలుగు, ఇంగ్లీషు మార్చి మార్చి టైపు చేసుకోవచ్చు. ఇలా చేయని పక్షంలో ప్రతిసారి అప్లికేషన్లో రాసే చోట right click చేసి, Input methid ని SCIM గా ఎంచుకోవాల్సి వస్తుంది.
లినక్స్ లో తెలుగు చదవడం

అసలు ముందుగా ఈ పాఠ్యాంశం చదవి, చెప్పింది చేయడానికి, తెలియాల్సినవి ఏమన్నా తెలియకపోతే తెలుసుకుందాం. ఏది తెలియకపోయినా దాని మీద నొక్కేసి, చదివేసి మళ్ళీ వెనక్కి వచ్చేయండి.
- terminal (టర్మినల్)
- yum (యమ్)
- apt-get (యాప్ట్-గెట్) లేదా synaptic(సినాప్టిక్)
హా! ఇప్పుడు అన్నీ తెలుసన్నమాట! మీకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఇదిగో ఈ క్రింది చెప్పింది చేసేయ్యండి. లేకపోతే ఇక్కడ నొక్కితే ఇంకొంచెం క్రిందికెళతారు, అక్కడ చెప్పింది చేసేయ్యండి.
ఇంటర్నెట్ సదుపాయం ఉంటే
Alt+F2 కొట్టి ఆ వచ్చిన బాక్సులో gnome-terminal అని కొట్టి ఈ కిందున్న commands ని copy paste చేసి రన్ చేయండి
ఫెడోరా(Fedora) వాడేవారు
yum -y install openoffice.org-langpack-te_IN aspell-te fonts-telugu.noarch lohit-fonts-telugu.noarch
ఉబుంటు(Ubuntu) వాడేవారు
sudo apt-get install aspell-te language-pack-te language-support-te openoffice.orgl10n-te-in ttf-telugu-fonts
ఒకసారి కంప్యూటర్ రీబూట్ చేయండి. పైన చెప్పినట్టు చేసినప్పటికీ, అప్పుడప్పుడు విహారిణిలో(browsers) బాగా చదవగలగాలంటే అందులో కూడా తగు మార్పులు చేయాల్సుంటుంది.
పైర్‌ఫాక్స్ వాడేవారికి అదంతా అవసరం లేదులేండి. ఫైర్‌ఫాక్స్ ౩.౦ వర్షన్ నుండి ఏం చేయనక్కర్లేకుండానే తెలుగు శుభ్రంగా కనిపిస్తుంది. కాని అంతకు ముందు వర్షన్‌లలో ఏమన్నా తేడగా ఉంటే మాత్రం తలనొప్పే సుమా. అందుకే, ఇక్కడ నుండి అత్యాధునిక వర్షన్‌ని దింపుకుని(download చేస్కుని), స్థాపించేస్కోండి(install అన్నమాట). అంతే!
ఒకవేళ మీరు ఎపిఫనీ(Epiphany) విహారిణి(browser) వాడే అరకొరమందిలో ఒకరైతే, అందులో తెలుగు పదాలు సరైన రీతిలో కనబడడానికి Pango rendering అనేది ఒకటవసరం. దానికోసం మీరు చేయాల్సిందల్లా…
- Alt+F2 కొట్టి ఆ వచ్చిన Run Application బాక్సులో gconf-editor అని కొట్టి Run కొట్టండి.
- అలా కొడితే వచ్చిన విండోలో ఎడమవైపునున్న menu లో apps>epiphany లో web section కి వెళ్ళండి.
- ఇప్పుడు అదే విండోలో కుడివైపు చూస్తే enable_pango అనేదొకటుంటుంది. దానికి టిక్ పెట్టేయండి.
- హమ్మయ్య! ఓ మారు ఎపిఫనీని మూసి-తెరిస్తే మన తెలుగు, తెలుగులా అందంగా కనబడుతుంది :)
ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే
- ఈ లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
- దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను ~/.fonts డైరెక్టరీలోకి copy చేయండి. విహారిణిని(బ్రౌజర్) తెరిచివుంటే ఒకసారి మూసి, తెరవండి.
- ఏదైన తెలుగు వెబ్‌సైట్ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.
అక్కడికీ సమస్య తీరకపోతే, పోనీ ఇక్కడ చెప్పిన పద్దతి మీకు నచ్చకపోతే మీరు వాడుతున్న OS, విహారిణి(browser) పేర్లు, వర్షన్‌ల వివరాలతో ఇక్కడే అడిగేస్తే నా శక్తి కొద్దీ సమాధానం చెప్తాను.
లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?
28 August 2009

లక్ష్యం:
ఈ టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.
టెర్మినల్ తెరవటానికి, Alt+F2 నొక్కి gnome-terminal అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.
టెర్మినల్ లో “sudo pppoeconf” అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ కోసం అడుగుతుంది, పాస్‌వర్డ్ ఇవ్వగానే ‘ఎస్ ఆర్ నో’ అని అడుగుతుంది, ఇలా’ కనిపించిన ప్రతి సారీ ఎంటర్ నొక్కటామే మనం చెయ్యవలసినది.
కాసేపు ఉన్న అవకాశాల కోసం స్క్యాన్ చేస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ username password అడుగుతుంది. అవి ఇవ్వటం ఎంటర్ నొక్కటం, ఇదే మనం చెయ్యవలసింది. ఇలా మొదటి సారి చేశాక, మీరు కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతి సారీ దానంతటదే ఇంటెర్నెట్‌కు కనెక్ట్ ఐపోతుంది.
కనెక్ట్ అయ్యిందో లేదో చూడటానికి Firefox తెరిచి ఏదైనా వెబ్సైట్ వెళ్ళటానికి ప్రయత్నించి చూడండి.












