Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

సమస్యలు-సలహాలు

25 February 2010

సమస్య :  ఐడియా నెట్‌ సెట్టర్‌ వాడుతున్నాను. 5 నుంచి 10 కేబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను 53.5 నుంచి 236.6 కేబీపీఎస్‌గా చూపిస్తోంది. బ్రౌజింగ్‌ వేగం బాగా తగ్గిపోయింది. నెట్‌ స్పీడ్‌ని పెంచేందుకు ఏమైనా మార్గాలున్నాయా?

e-కబుర్లు

పూర్తిగా తెలుసుకోండి

కంప్యూటర్‌ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్‌ అవుతున్న ప్రాసెస్‌లు, స్టార్ట్‌అప్‌ ప్రోగ్రాంలు, విండోస్‌ అప్‌డేట్స్‌ నెట్‌వర్క్‌ సమాచారం, ఈవెంట్‌ లాగ్‌, యాంటీ వైరస్‌ వివరాల్ని కూడా పొందవచ్చు. ఆ రిపోర్ట్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. దాన్ని ఈ-మెయిల్‌ చేయవచ్చు. ఇది అన్ని విండోస్‌ వెర్షన్లలో పని చేస్తుంది.

తాకితే చాలు మౌస్ క్లిక్ అవుతుంది

మౌస్‌ రూపం మారిపోతోంది! కుడి, ఎడమ బటన్స్‌ మాయం.. మధ్యలో స్క్రోలింగ్‌ చక్రం కనిపించదు.. ఓ కొత్త రూపం! తాకే తెర మాదిరిగా తాకే మౌస్‌ (మల్టీటచ్‌ మౌస్‌). పేరు ‘మ్యాజిక్‌ మౌస్‌'. ఐమ్యాక్‌ యూజర్లకు ప్రత్యేకంగా దీన్ని డిజైన్‌ చేశారు.

డెస్క్‌టాప్‌కు అదనపు సౌకర్యం



సిస్టంలోని అప్లికేషన్‌ ప్రొగ్రాంలను ఓపెన్‌ చేయాలంటే స్టార్ట్‌ బటన్‌, రన్‌ కమాండ్‌ లాంటివి తెలిసిందే. భిన్నంగా అప్లికేషన్స్‌, ఫోల్డర్స్‌, ఫైల్స్‌ని ఓపెన్‌ చేయాలంటే?

విద్యుత్‌ తీగల ద్వారా ల్యాన్‌ నెట్‌వర్క్

ఆఫీస్‌లోనైనా, ఇంట్లోనైనా లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (LAN) ఏర్పాటు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్‌.. ఖర్చూ ఎక్కువే! ఇప్పుడొక సులువైన విధానం ముందుకు రాబోతోంది... అదే విద్యుత్‌ తీగల ద్వారా ల్యాన్‌! ఖర్చు కూడా తక్కువే!! - అనంతపురం జిల్లాకు చెందిన ఇంజినీర్‌ రమేష్‌ కుమార్‌ ఈ విధానానికి రూపకర్త.

కొత్త విండోస్‌తో సెల్‌ సొగసులు!

విండోస్‌ ఫోన్‌ 7 సిరీస్‌ సులువైన ఇంటర్ఫేస్‌.. ఆధునిక సౌకర్యాలు.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌.. వీడియో గేమ్స్‌.. రియల్‌ టైం అప్‌డేట్స్‌.. చిటికెలో పోస్టింగ్స్‌.. మొబైల్‌ విప్లవంలో

ఇదో కొత్త ఆపరేటింగ్‌ సిస్టం!

10 వేలకే నోట్‌బుక్ కంప్యూటర్

22 February 2010

10 వేలకే నోట్‌బుక్ కంప్యూటర్..

ప్రశ్న-జవాబులు

12 February 2010

* పీ4 డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 160 జీబీ హార్‌డిస్క్‌లతో సిస్టం వాడుతున్నాను. న్యూఫోల్డర్‌ వైరస్‌ ప్రవేశించింది. నేను వాడుతున్న యాంటీవైరస్‌ ఏవీజీ 8 పాడయ్యింది. న్యూఫోల్డర్‌ వైరస్‌ను తొలగించడం ఎలా?

కొత్తగా ఏదైనా యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, అప్‌డేట్‌ చేసిన తర్వాత సిస్టంని పూర్తిగా స్కాన్‌ చేయండి. కింది వెబ్‌సైట్‌ ఆధారంగా వైరస్‌ను మాన్యువల్‌గా డిలీట్‌ చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు.
http://infosecawareness.in/virus-spam-phishing/how-to-remove-the-virus-manually
http://amiworks.co.in/talk/how-to-remove-new-folderexe-or-regsvrexr-or-autoruninf-virus/

*విండోస్‌ 7 64 బిట్‌ హోం ప్రీమియం వెర్షన్‌ వాడుతున్నాను. సీ డ్రైవ్‌ 285 జీబీ. ఇప్పుడు సీ డ్రైవ్‌ని పార్టీషన్‌ చేసి 100 జీబీతో డీ, 100తో జీబీ ఈ డ్రైవ్‌లను క్రియేట్‌ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో తెలుపగలరు?

కింది సైట్‌లోని Easus Partition Master టూల్‌ హోం ఎడిషన్‌ని డౌన్‌లోడ్‌ చేసి ప్రయత్నించండి. partition-tool.com/



*ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం వాడుతున్నాను. కొన్ని రోజులు సిస్టంలోని కొన్ని సాఫ్ట్‌వేర్‌లు సరిగా పని చేయడం లేదు. ఇన్‌స్టాల్‌ చేస్తుంటే మధ్యలో data cobinet file error అని వచ్చి file missed retry to copyఅని మెసేజ్‌ వస్తోంది. cabinet ఫైల్‌ ఎర్రర్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌లను కాపాడడం ఎలాగో తెలుపగలరు?

కేబినెట్‌ ఎర్రర్‌ అనేది అప్లికేషన్‌ బట్టి ఉండొచ్చు. ఉదాహరణకి ఆఫీస్‌ అప్లికేషన్‌ కోసం ఈ కింది వెబ్‌సైట్‌లో చెప్పినట్టుగా పరిష్కరించుకోవచ్చు. support.microsoft.com/kb/284250



*ల్యాప్‌టాప్‌ను విండోస్‌ ఎక్స్‌పీతో వాడుతున్నాను. Apology Ur Software/hardware edameged, windows xp failure అనే ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోంది. పరిష్కారం తెలుపగలరు?

మీరు పంపిన ప్రశ్నలో ఎర్రర్‌ మెసేజ్‌ పూర్తిగా పంపితే సరైన సమాధానం ఇవ్వొచ్చు. మీ హార్డ్‌డిస్క్‌ ఫెయిల్‌ అయినా, మెమొరీ సరిగా పని చేయకపోయినా ఇలాంటి ఎర్రర్స్‌ వస్తాయి. మీ హార్డ్‌డిస్క్‌, మెమొరీ మాడ్యూల్స్‌ని రిమూవ్‌ చేసి మళ్లీ పెట్టండి. అంతేకాకుండా బయోస్‌ని ఒక్కసారి చెక్‌ చేయండి.



*నా కంప్యూటర్‌లో ఉన్న 10 జీబీ స్పేస్‌ని C D E F గా విభజించాను. సీ డ్రైవ్‌లో 8.25 జీబీ మెమొరీ వరకూ వాడేశాను. దీంతో కొన్ని ఫైల్స్‌ నెమ్మదిగా ఓపెన్‌ అవుతున్నాయి. ఏం చేయమంటారు?

మీ ఆపరేటింగ్‌ సిస్టం ఫైల్స్‌, ప్రోగ్రాంకు సంబంధించిన ఫైల్స్‌ సీ డ్రైవ్‌లో ఉండడం వల్ల అది నిండిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ డ్రైవ్‌ నిండిపోతే ఫైల్స్‌ని యాక్సెస్‌ చేయడం స్లో అవుతుంది. అందుకే సీ డ్రైవ్‌లోని టెంపరరీ ఫైల్స్‌, డెస్క్‌టాప్‌పై ఉన్న పర్సనల్‌ ఫైల్స్‌లను వేరే డ్రైవ్‌ల్లోకి కాపీ చేయండి. సీ డ్రైవ్‌లో ఎక్కువ స్పేస్‌ ఉండేటా చేయండి.

  

బ్రౌజింగ్‌ చేస్తున్నారా? షార్ట్‌కట్స్‌

ఎక్కువగా బ్రౌజింగ్‌ చేస్తున్నారా? అయితే ఈ షార్ట్‌కట్స్‌ ద్వారా సైట్‌ చివర వచ్చే .com, .net, .orgలను టైప్‌ చేయక్కర్లేదు.

ఆన్‌లైన్‌లోనే స్కానింగ్‌ & ఉచిత సాఫ్ట్‌వేర్‌లు.. మెయిల్‌ సర్వీసులు

యాంటీ వైరస్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుండానే మీ పీసీలో వైరస్‌లను స్కాన్‌ చేయవచ్చు. Novirus Scanner
ఆన్‌లైన్‌ యాంటీవైరస్‌ స్కానింగ్‌తో ఇది సాధ్యం. మల్టీ ఇంజన్‌ యాంటీవైరస్‌ స్కానర్‌ ద్వారా

ఇన్‌స్టలేషన్‌ లేకుండానే

ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ లేకుండా రన్‌ అయ్యే సాఫ్ట్‌వేర్‌ల కోసం
Portable Freeware
Portable Apps
Pen Drive Apps
Portable softwares downloads.blogspot.com
Portable Softwares Links
Portable USB Apps

భద్రం సుమా!

వ్యక్తిగత ఫైల్స్‌ను సురక్షితం చేసుకోవాలనుకుంటున్నారా? రెండు ఉచిత సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అవే My Private Folder, My Lockbox టూల్స్‌. వివరాలకు
Private Folder
Lock బాక్స్
 

స్కిన్స్‌ మార్చేయండి

వీఎల్‌సీ ప్లేయర్‌ను ఒకేలా చూసి బోర్‌ కొడుతోందా? భిన్నమైన దీᄆమ్స్‌తో మార్చుకుని వీడియోలను వీక్షించవచ్చు. అదెలాగో తెలియాలంటే

చక్కని షార్ట్‌కట్స్‌

కీబోర్డ్‌లోని Win కీతో కొన్ని షార్ట్‌కట్స్‌ చేసుకోవచ్చని తెలుసా?
Win + M ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌చేస్తుంది.
Win + Shift + M- మాక్సిమైజ్
Win + E ఓపెన్‌ మై కంప్యూటర్‌
Win + F విండోస్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌
Win + U యుటిలిటీ మేనేజర్
Win + Pause సిస్టం ప్రోపర్టీస్
Win + tab టాస్క్‌బార్‌పై మినిమైజ్‌ చేసిన వాటిని యాక్సెసింగ్‌.
Win + F1 విండోస్‌ హెల్ఫ్‌పేజ్‌.

ఈ-కబుర్లు మీవే

నకిలీ ఫైల్స్‌.. సాఫ్ట్‌వేర్స్‌.. షార్ట్‌కట్స్‌!

డ్రైవ్‌లో అనేక చోట్ల భద్రం చేసిన డూప్లికేట్‌ ఫైల్స్‌ని వెతికి డిలీట్‌ చేయాలనుకుంటున్నారా? విండోస్‌ కీతో షార్ట్‌కట్స్‌ భలే భలే! వ్యక్తిగత సమాచారాన్ని భద్రం చేసుకోవాలా? ఆన్‌లైన్‌లోనే స్కానర్స్‌తోనే వైరస్‌ ఫైల్స్‌ను ఏరిపారేయాలా? అన్నింటికీ పరిష్కారంగా పాఠకులు చెప్పే ‘ఈ-కబుర్లు' చదవండి మరి!

నకిలీవైతే తీసేయండి

అనవసరమైన ఫైల్స్‌ వల్ల సిస్టం వేగం మందగించిందా? అయితే వాటిని తొలగించడానికి సులువైన మార్గం ఉంది. అదే Duplicate File Detector. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని టెక్ట్స్‌, బైనరీ, మ్యూజిక్‌, వీడియో, ఇమేజ్‌... ఫార్మెట్స్‌కు చెందిన డూప్లికేట్‌ ఫైల్స్‌ని వెతికి డిలీట్‌ చేయవచ్చు. వివరాలకు Duplicate File Detector

సరికొత్త యూఎస్‌బీ అవతారాలు


కాళ్లూ... చేతులూ యూఎస్‌బీలే!:

మీ ల్యాప్‌టాప్‌, పీసీలకు ఒకేసారి ఎక్కువ యూఎస్‌బీలను అనుసంధానం చేయాలంటే? ఏముందీ.. ఒక మనిషిని పెట్టుకుంటే సరి! అదేనండీ కింద కనిపించే ‘యూఎస్‌బీ మ్యాన్‌' కొనుక్కుంటే సరిపోతుంది. ఇతని చేతులు, కాళ్లే యూఎస్‌బీ పోర్ట్‌లు.

అన్నీ ఇందులోనే

‘కళను నమ్ముకున్న వారు కష్టాలు పడరు..' QBN కమ్యూనిటీ ఇచ్చే భరోసా ఇది. Cover, Classic, Job Board, Filter విభాగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా డిజైనింగ్‌ పరిశ్రమకు సంబంధించిన అప్‌డేట్స్‌ని అందిస్తోంది. ఉద్యోగ అవకాశాల్ని కూడా తెలియజేస్తుంది.

మాల్వేర్‌ల పని పట్టండి!


సిస్టంలో మాల్వేర్‌లు మాటేసుకుని కూర్చున్నాయా? Malwarebytes Anti Malwareను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి! ప్రతి ప్రాసెస్‌ను మానిటర్‌ చేస్తూ మాలిషియస్‌ ప్రాసెస్‌ మొదలు కాకముందే ఆపేయడం యాంటీ మాల్వేర్‌ ప్రత్యేకత.Malware Bytes

డాక్టర్‌ సైట్‌

డాక్టర్‌ని కలవక ముందే మీ ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర అవగాహన కలగాలంటే Medhelp సైట్‌ను చూడండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌ కమ్యూనిటీ! సభ్యత్వం నమోదు చేసుకుని వ్యాధి లక్షణాల ఆధారంగా కమ్యూనిటీలోని డాక్టర్ల ద్వారా చికిత్స వివరాలు తెలుసుకోవచ్చు. పర్సనల్‌ హెల్త్‌ అప్లికేషన్స్‌ కూడా ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధుల గురించి వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు.

మీ ప్రేమ రంగుల మయం!

ప్రేమికులారా..! ఒకరి రూపాన్ని మరొకరు గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారా? ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. ఆలస్యం చేయకుండా హృదయాంతరాళాల్లో దాచుకున్న రూపాన్ని సిస్టం హార్డ్‌డిస్క్‌లోకి పంపి... సాఫ్ట్‌వేర్‌ బ్రెష్‌తో... ఎంఎఫ్‌ హుస్సెన్‌లా ఆకర్షణీయమైన పెయింటింగ్‌లా గీసేయండి. బహుమతిగా అందించి మీ ప్రేమను రంగుల మయం చేయండి. అదెలాగో తెలియాలంటే

కమ్మని తెలుగులో కంప్యూటర్‌ పాఠాలు!

కమ్మని తెలుగులో కంప్యూటర్‌ పాఠాలు!
టెక్‌ పాఠాలు నేర్చుకోవాలనుందా? అమ్మభాషే వారధిగా ఓ కమ్యూనిటీ సిద్ధమవుతోంది! కాసులు పోసే సాఫ్ట్‌వేర్‌లు అవసరం లేదు.. పరాయి భాషతో పోరాటం అక్కర్లేదు.. అదే ‘స్పోకెన్‌ ట్యుటోరియల్‌'
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్టు తీసుకోవడం ఎలా? అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎలా పని చేస్తుంది? యాడ్‌ఆన్స్‌తో బ్రౌజింగ్‌ను మెరుగుపరుచుకోవడం ఎలా?... ఇలా కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అప్లికేషన్లను నేర్చుకోవాలంటే నేటి వరకూ ఆంగ్ల భాషే ప్రధాన వారధి. ఈ హద్దుని చెరిపేస్తూ దేశ వ్యాప్తంగా 16 ప్రాంతీయ భాషాల్లో ఆన్‌లైన్‌లోనే వీడియో, ఆడియో ట్యుటోరియల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ముంబయికు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. పేరు

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English