Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
విద్యుత్ తీగల ద్వారా ల్యాన్ నెట్‌వర్క్
25 February 2010Posted by
INDUSTAN
0 Comments

పని చేసేదిలా..!
ఇల్లు, కార్యాలయంలో ప్రధాన విద్యుత్ సరఫరా వ్యవస్థ వద్ద సాధారణ ప్లగ్‌కు డిఎస్‌ఎల్ అడాప్టర్‌ను అమర్చాలి. తర్వాత కంప్యూటరు చేరువలోని ప్లగ్ నుంచి కంప్యూటరును ఈథర్నెట్ అడాప్టరుతో అనుసంధానం చేస్తే సరి. లోకల్ ఏరియా నెట్‌వర్కు సిద్ధం. కార్యాలయానికి అందే అంతర్జాల వ్యవస్థ నుంచి డీఎస్‌ఎల్ అడాప్టర్ అంతర్జాల సంకేతాల్ని స్వీకరించి ఈథర్నెట్ అడాప్టరు ద్వారా కంప్యూటరుకు పంపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని స్పార్ సూపర్ బజార్ ఈ పరికరాలతోనే లోకల్ ఏరియా నెట్ వర్కును ఏర్పాటు చేసుకుంది. ఇంకా రెండు బ్యాంకులు, బ్రాడ్ బ్యాండ్ సంస్థ, కొన్ని దేశాల రైల్వేలు కూడా దీని గురించి వాకబు చేస్తున్నాయని రూపకర్త రమేష్ కుమార్ చెబుతున్నారు.
మరికొన్ని ఉత్పత్తులు
* రైళ్లలో కూడా ఈ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో రైలు ప్రమాదాల్ని అరికట్టవచ్చని రమేష్ చెబుతున్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవడంతో పాటు రైలులో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే మన దేశంలోనూ, మలేషియాలోనూ ఈ ఉత్పత్తుల్ని పరీక్షించారు. వీటికి పేటెంట్ హక్కుల్ని కూడా పొందారు.
* ఒకే ఇంట్లో నాలుగైదు టీవీలు వాడుతుంటే ఒకే కేబుల్ కనెక్షన్‌తో అన్ని టీవీల్లోనూ ఛానల్స్ వీక్షించవచ్చు. ‘టీవీ ఆన్ పవర్‌లైన్' అనే ప్రత్యేక పరికరంతో ఇది చాలా సులభం. దీనికి కూడా పేటెంట్ హక్కుల్ని పొందారు.
* ఇంట్లో ఎంత విద్యుత్ వాడామో తెలుసుకోవడానికి ఆటోమాటిక్ మీడర్ రీడింగ్ డివైజ్ రూపొందించారు. దీన్ని మీటరకు అనుసంధానం చేయడం ద్వారా సబ్‌స్టేషన్‌లోనే ఉండే మీటర్ రీడింగ్‌ను తెలుసుకోవచ్చు.
రండేళ్ల శ్రమ
ఇంజనీర్ రమేష్ కుమార్ తన మిత్ర బృందంతో రెండేళ్ల పాటు శ్రమించి ఈ ఉత్పత్తుల్ని తయారు చేశారు. 2009 ఆగస్ట్‌లో స్పార్ హైపర్ మార్కెట్లో దీన్ని ఇన్‌స్టాల్ చేశారు. ఆయన ఆలోచనలకు అమెరికాలోని సెంట్రల్ అర్కనాస్ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడుగా పనిచేస్తున్న పరుచూరి వంశీ తన వంతు సహకారాన్ని అందించారు. విద్యుత్ మార్గంలో అంతర్జాల తరంగాల్ని పంపటం గురించి ఇద్దరికీ సంయుక్తంగా ఆరు మేధో హక్కులు లభించాయి. విద్యుత్ తీగల ద్వారా అంతర్జాల సంకేతాల్ని పంపటం పాశ్చాత్య దేశాల్లో కొత్తేమీ కాదు. దాన్ని మన దేశ వాతావరణానికి అనువుగా తీర్చి దిద్దటమే విశేషం. చలి ఎక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లో వినియోగించే పరికరాలు ఇక్కడ పనికి రావు. ఇక్కడి ఉష్ణ మండల వాతావరణానికి తగినట్లు వాటిని మార్చాలి.మరిన్ని వివరాలకుUNIFIED GATEWAYS
Labels:
ల్యాన్ నెట్‌వర్క్
Subscribe to:
Post Comments (Atom)