Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
సరికొత్త యూఎస్‌బీ అవతారాలు
12 February 2010Posted by
INDUSTAN
0 Comments

కాళ్లూ... చేతులూ యూఎస్‌బీలే!:
మీ ల్యాప్‌టాప్, పీసీలకు ఒకేసారి ఎక్కువ యూఎస్‌బీలను అనుసంధానం చేయాలంటే? ఏముందీ.. ఒక మనిషిని పెట్టుకుంటే సరి! అదేనండీ కింద కనిపించే ‘యూఎస్‌బీ మ్యాన్' కొనుక్కుంటే సరిపోతుంది. ఇతని చేతులు, కాళ్లే యూఎస్‌బీ పోర్ట్‌లు.ప్రత్యేక ఎసీ ఆడాప్టర్‌తో ఈ యూఎస్‌బీ మనిషి చక్కగా పని చేస్తాడు. గుండెపై పచ్చ రంగుతో వెలుగుతూ పని చేయడం మొదలుపెడతాడు. USB Man
ఇదేమో ఫ్యాన్:
ఫ్యాన్, ఏసీ సదుపాయం లేని చోట మీ ల్యాప్‌టాప్‌తో ఎక్కువ సయమం పని చేయాల్సివస్తే! ఈ ‘యూఎస్‌బీ నోట్‌బుక్ ఫ్యాన్'ను వాడేయండి. మూడు ఈవీఏ ఫ్యాన్ బ్లేడ్స్‌తో దీన్ని రూపొందించారు. పొడవు 24 సెంటీమీటర్లు. USB Fanబుల్లి లైట్‌లా..!:
అందరూ నిద్రలో ఉన్నారు. మీరేమో ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నారు. అవసరార్థం పేపర్ డ్యాక్యుమెంట్‌ను చదవాల్సివస్తే? లైట్ ఆన్ చేసి ఇతరుల నిద్రని పాడు చేయకుండా ఈ ‘యూఎస్‌బీ ఫ్లెక్స్‌లైట్'ను ఆన్ చేస్తే సరి! ఎలా దీన్ని వాడడం?దీంట్లో బ్యాటరీలు ఉండవు. యూఎస్‌బీ డ్రైవ్ మాదిరిగా మీ ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే సరి! లెడ్ డిజైన్‌తో దీన్ని రూపొందించారు. నోట్‌బుక్ కేస్‌లో చక్కగా ఒదిగిపోతుంది.
Subscribe to:
Post Comments (Atom)