Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

సమస్యలు-సలహాలు

25 February 2010

సమస్య :  ఐడియా నెట్‌ సెట్టర్‌ వాడుతున్నాను. 5 నుంచి 10 కేబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను 53.5 నుంచి 236.6 కేబీపీఎస్‌గా చూపిస్తోంది. బ్రౌజింగ్‌ వేగం బాగా తగ్గిపోయింది. నెట్‌ స్పీడ్‌ని పెంచేందుకు ఏమైనా మార్గాలున్నాయా?
సలహాలు:  ఐడియా నెట్‌ సెట్టర్‌ సాధారణంగా జీపీఆర్‌ఎస్‌, ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఎడ్జ్‌ అయితే 240 కిలోబిట్స్‌, జీపీఆర్‌ఎస్‌ 86 కిలోబిట్స్‌ వరకూ మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. వైర్‌లెస్‌ సిగ్నల్స్‌, ఇతర కారణాల వల్ల మీకు అంతకన్నా తక్కువ స్పీడ్‌ వస్తుంది. స్పీడ్‌ని పెంచడానికి ఇంటర్నెట్‌ సిగ్నల్‌ బూస్టర్స్‌ ఉంటాయి. సరైన వాటి కోసం ఐడియా కస్టమర్‌ కేర్‌ని సంప్రదించండి. High Speed Internet Access Guide సైట్‌ని కూడా చూడండి.

సమస్య :   లెనెవా ల్యాప్‌టాప్‌ టి61 వాడుతున్నాను. కొన్నప్పుడు విస్టా ఓఎస్‌ లోడ్‌ చేశాను. తర్వాత ఎక్స్‌పీ ఎస్‌పీ2, ఎక్స్‌పీలకు మారాను. స్టార్ట్‌అప్‌లో సమస్య వస్తోంది. కీబోర్డ్‌, మౌస్‌ స్టార్ట్‌అప్‌ తర్వాత కనిపించడం లేదు. వేరే మార్గం లేక పవర్‌బటన్‌ ద్వారా షట్‌డౌన్‌ లేదా రీస్టార్ట్‌ చేస్తున్నాను. కొన్నిసార్లు బాగానే పని చేస్తోంది. పరిష్కారం తెలుపగలరు?

సలహాలు:  లెనోవా టీ61 మోడల్స్‌లో ఎక్స్‌పీ లోడ్‌ చేశాక మౌస్‌, కీబోర్డ్‌ హ్యాంగ్‌ అవ్వడం సర్వసాధారణం. ఇది అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ మధ్యే డ్రైవర్స్‌ అప్‌డేట్‌ చేశారు. రిక్వస్ట్‌ కోసం ఈ కింది వెబ్‌సైట్‌ను సంప్రదించండి. Drivers Update

సమస్య :   ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌లను యాక్సెస్‌ చేయలేకపోతున్నాను. మిగతా అన్ని సర్వీసులు ఓపెన్‌ అవుతున్నాయి. ఎందుకీ సమస్య వస్తోంది?

సలహాలు:  సిస్టం బ్రౌజింగ్‌ సెట్టింగ్స్‌లో ఆయా సైట్స్‌ని యాక్సెస్‌ చేయకుండా పరిధుల్ని ఏర్పాటు చేసుంటారు. లేదా పేరెంటల్‌ కంట్రోల్స్‌ ద్వారా కూడా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ని బ్లాక్‌ చేసి ఉండోచ్చు.

సమస్య :   మైక్రోసాఫ్ట్‌ డెవలెప్‌ చేసిన Microsoft Essential కి మిగతా యాంటీ వైరస్‌లకు మధ్య తేడా ఏంటి?

సలహాలు:  మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ ఎసెని్షయల్స్‌ మిగతా యాంటీ వైరస్‌ల మాదిరిగానే పని చేస్తాయి. అయితే, వివిధ యాంటీ వైరస్‌ల మధ్య తేడా అనేది చెప్పడం కొంచెం కష్టం. ఏఏ యాంటీ వైరస్‌లు అప్‌డేట్స్‌ని, రికవరీ టూల్స్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటాయో అవే పాపులర్‌ అవుతాయి. ఇతర వివరాలకు Microsoft Essential

సమస్య :   జీమెయిల్‌ నుంచి కొన్ని గుర్తు తెలియని మెయిల్స్‌ వస్తున్నాయ. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా?

సలహాలు:  మీరు ఏ మెయిల్‌ సర్వీసు వాడుతున్నారో చెప్పలేదు. కింది వెబ్‌సైట్‌లో చెప్పినట్టుగా మీకు వచ్చిన మెయిల్‌ హెడ్డర్స్‌ కాపీ చేసి పంపించండి.Cyberforensics అలాగే, కింది వెబ్‌సైట్‌లో హెడ్డర్స్‌ని కాపీ చేసి ట్రేస్‌ చేయండి. Cyberforensics

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English