Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

e-కబుర్లు

25 February 2010

పూర్తిగా తెలుసుకోండి

కంప్యూటర్‌ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్‌ అవుతున్న ప్రాసెస్‌లు, స్టార్ట్‌అప్‌ ప్రోగ్రాంలు, విండోస్‌ అప్‌డేట్స్‌ నెట్‌వర్క్‌ సమాచారం, ఈవెంట్‌ లాగ్‌, యాంటీ వైరస్‌ వివరాల్ని కూడా పొందవచ్చు. ఆ రిపోర్ట్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. దాన్ని ఈ-మెయిల్‌ చేయవచ్చు. ఇది అన్ని విండోస్‌ వెర్షన్లలో పని చేస్తుంది.


అన్నీ ఒకే చోట

ఉచిత సాఫ్ట్‌వేర్‌లన్నీ ఒకేచోట కనిపించాలంటే A software + చూడండి. ఎంపీ3 కట్టర్‌ ప్లస్‌, డీవీడీ కట్టర్‌ ప్లస్‌, ఫొటో కట్టర్‌, కన్వర్ట్‌ వేవ్‌ టూ ఎంపీ3, డిజిటల్‌ ఆడియో రికార్డర్‌, టేక్‌ స్క్రీన్‌షాట్‌... లాంటి అనేక సాఫ్ట్‌వేర్‌లను దీంట్లో నిక్షిప్తం చేశారు.

జీమెయిల్‌ డ్రైవ్‌

జీమెయిల్‌ ఎకౌంట్‌ ఆధారంగా సిస్టంలో వర్చువల్‌ ఫైల్‌ సిస్టంను క్రియేట్‌ చేసుకోవాలనుకుంటే బ్ఝ్చిGmail Drive ఇన్‌స్టాల్‌ చేసుకోండి. జిప్‌ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుని మై కంప్యూటర్‌లో వచ్చిన జీమెయిల్‌పై రైట్‌ క్లిక్‌ చేసి జీమెయిల్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్‌ అవ్వండి. అన్ని డ్రైవ్‌ల మాదిరిగానే యాక్సెస్‌ చేయవచ్చు. Gmail codeఎక్కువగా ప్రజంటేషన్స్‌ చేస్తుంటే, Mouse Shade టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని మౌస్‌తో మ్యాజిక్‌ చేయండి. టర్న్‌ఆన్‌ చేసి ప్రజంటేషన్స్‌లో చెబుతున్న అంశాన్ని మాత్రమే కనిపించేలా స్పాట్‌లైట్‌ ఎఫెక్ట్‌ క్రియేట్‌ చేయవచ్చు. Mouseshade

మీరే వీడియో గేమ్‌ డిజైనర్‌

మీరే వీడియోగేమ్‌ను డిజైన్‌ చేసే వీలుని Microsoft KODU Game Lab కల్పిస్తోంది. ప్రొగ్రామింగ్‌ నాలెడ్జ్‌ లేకున్నా యూజర్‌ ఇంటర్ఫేస్‌ వర్చువల్‌ ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజి ద్వారా గేమ్స్‌ రూపొందించవచ్చు. వాటిని ఎక్స్‌బాక్స్‌ గేమ్‌ కంట్రోల్‌ అవసరం లేకుండానే విండోస్‌ పీసీలో మౌస్‌, కీబోర్డ్‌ సాయంతో ప్లే చేయవచ్చు. గేమ్స్‌ని క్రియేట్‌ చేయడంలో ట్యుటోరియల్స్‌ ఉపయోగపడతాయి. రన్‌ చేయడానికి .NET 3.5, XNA framework 3.1 సాఫ్ట్‌వేర్‌లు అవసరం. Kodu Game

ఫొటోలతో ఆడుకోండి

మీ ఫొటోలను అభిమాన హీరో పక్కన, కరెన్సీ నోటు మీద, మైకెల్‌ జాక్సన్‌ సరసన, ప్రముఖ పత్రికల్లో... ఇలా రకరకాలుగా చూసుకోవాలనుకుంటే ఈ సైట్స్‌ను సందర్శించండి.

వెబ్ సైట్లను సులువుగా ఓపెన్ చేయడానికి షార్ట్ కట్స్ :

www.google.com సైట్ కి వెళ్ళడం కోసం  google అని అడ్రస్ బార్ లో టైపు చేసి  Ctrl + Enter చేయండి
www.wikipedia.org  సైట్ కి వెళ్ళడం కోసం wikipedia   అని అడ్రస్ బార్ లో టైపు చేసి  Ctrl + Shift + Enter చేయండి
www.asp.net సైట్ కి వెళ్ళడం కోసం asp అని అడ్రస్ బార్ లో టైపు చేసి  Shift + Enter చేయండి

ఫైర్‌ఫాక్స్‌లో షార్ట్ కట్స్

ఫైర్‌బాక్స్‌ వెర్షన్‌తో బ్రౌజింగ్‌ చేస్తున్నారా? షార్ట్‌కట్స్‌ బోలెడు. Ctrl+B తో బుక్‌మార్క్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.
Ctrl+H తో హిస్టరి సైడ్‌బార్‌,
Ctrl+p వెబ్‌పేజీ ప్రిటింగ్‌,
ctrl+R రీలోడ్‌ యాక్టీవ్‌ పేజ్‌,
Ctrl+Shift+Del- ప్రైవేటు డేటా క్లియరింగ్‌,  
Ctrl+Shift+D- ఓపెన్‌ చేసిన అన్ని ట్యాబ్‌లకు బుక్‌మార్కింగ్‌.
బ్రౌజింగ్‌ విండోని ఫుల్‌స్క్రీన్‌లో చూడాలంటే F11 నొక్కండి.

ఆటోమాటిక్‌ రిఫ్రెష్‌

బ్రౌజింగ్‌లో ఆన్‌లైన్‌ స్కోర్‌ చూస్తున్నప్పుడు, స్టాక్‌ ఎక్సెంజ్‌ రేట్లు గమనిస్తున్నప్పుడు F5 షార్ట్‌కట్‌తో ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేస్తుంటాం. రిజిస్ట్రీని ఎడిట్‌ చేయడం ద్వారా సిస్టం ఆటోమాటిక్‌గా రిఫ్రెష్‌ చేయవచ్చు. స్టార్ట్‌లోని రన్‌ను ఎంచుకుని Regedit లోని HKEY_LOCAL_MA CHINE/System/currentcontrolSet/Control/updatemode ను చూడండి. DWORD విలువను 1 నుంచి 5 కు మార్చండి.

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English