Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
కమ్మని తెలుగులో కంప్యూటర్ పాఠాలు!
12 February 2010Posted by
INDUSTAN
0 Comments
టెక్ పాఠాలు నేర్చుకోవాలనుందా? అమ్మభాషే వారధిగా ఓ కమ్యూనిటీ సిద్ధమవుతోంది! కాసులు పోసే సాఫ్ట్‌వేర్‌లు అవసరం లేదు.. పరాయి భాషతో పోరాటం అక్కర్లేదు.. అదే ‘స్పోకెన్ ట్యుటోరియల్'
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్టు తీసుకోవడం ఎలా? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుంది? యాడ్‌ఆన్స్‌తో బ్రౌజింగ్‌ను మెరుగుపరుచుకోవడం ఎలా?... ఇలా కంప్యూటర్, ఇంటర్నెట్ అప్లికేషన్లను నేర్చుకోవాలంటే నేటి వరకూ ఆంగ్ల భాషే ప్రధాన వారధి. ఈ హద్దుని చెరిపేస్తూ దేశ వ్యాప్తంగా 16 ప్రాంతీయ భాషాల్లో ఆన్‌లైన్‌లోనే వీడియో, ఆడియో ట్యుటోరియల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ముంబయికు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పేరు
SPOKEN-TUTORIAL.ORG ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీగా చెప్పుకునే దీంట్లో కంప్యూటర్ విజ్ఞానానికి సంబంధించిన వీడియోలను వివిధ భాషాల్లో నిక్షిప్తం చేశారు. మీ మాతృభాష ఆధారంగా కావాల్సిన వీడియో పాఠాన్ని బ్రౌజ్ చేసి చక్కగా వినొచ్చు. ఒకవేళ మీకు కావాల్సిన అంశం లేకపోతే ట్యుటోరియల్‌లోని యూజర్లను కోరవచ్చు.
సభ్యత్వ నమోదు
‘సాంకేతిక అభివృద్ధికి భాషే మూలాధారం!' నినాదంతో స్పోకెన్ ట్యుటోరియల్ రూపుదిద్దుకుంది. పేజీకి కుడివైపున ఉన్నCreate New Account ద్వారా సభ్వత్వం నమోదు చేసుకుంటే, మీ మెయిల్ ఐడీకి Approved మెయిల్ వస్తుంది. దాంట్లో ఉన్నట్టుగా చేస్తూ పాస్‌వర్డ్‌ని మార్చుకుని ఎకౌంట్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక ఆప్షన్లతో హోం పేజీ కనిపిస్తుంది. Most Watched Videos క్లిక్ చేసి అక్కడున్న వీడియోలను వీక్షించవచ్చు. కనిపించే వీడియో టైటిల్స్‌లో భాష కూడా కనిపిస్తుంది. Toggle FullScreen క్లిక్ చేసి వీడియోలను ఫుల్‌స్క్రీన్‌లో చూడొచ్చు. కావాలంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. నచ్చిన వీడియోలకు కామెంట్స్ రాయొచ్చు కూడా.
వీడియో... డబ్బింగ్
మీరే వీడియో ట్యుటోరియల్‌ని క్రియేట్ చేయాలనుకుంటే హోంపేజీలో Create Spoken tutorials క్లిక్ చేయండి. విండోస్ ఓఎస్‌ను వాడుతున్నట్లయితే Create Spoken Tutorial on windows OS using Camstudioను ఎంచుకోండి. 10 భాషల్లో కెమ్‌స్టూడియో ఏ విధంగా పని చేస్తుంది తెలిపే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వాటిల్లో తెలుగుని ఎంచుకుని సాఫ్ట్‌వేర్ పనితీరుని తెలుసుకోవచ్చు. కెమ్‌స్టూడియో ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్. కంప్యూటర్ తెరపై ఉన్నవాటిని ఏవీఐ ఫార్మెట్‌లో రికార్డ్ చేసి వీడియో ట్యుటోరియల్స్‌ని క్రియేట్ చేయవచ్చు. వివరాలకు Camstudio. అలాగే ముందుగానే క్రియేట్ చేసిన ట్యుటోరియల్స్‌ని నచ్చిన భాషలోకి మార్చాలనుకుంటే dubbingని క్లిక్ చేసి, dubbing on windows OS using windows Movie Maker లింక్ ద్వారా ఏం చేయాలో తెలుసుకోవచ్చు. వివరాలకుTools. ఈ టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని మీరు ట్యుటోరియల్స్ రూపొందించి కమ్యూనిటీ నిర్వాహకులకు పంపితే, నిపుణులు పరిశీలించి వీడియోల్లో పొందుపరుస్తారు.
అంశాన్ని కోరండి
ఏదైనా కొత్త అంశంపై ట్యుటోరియల్ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే Suggest a topic, Suggest an example ద్వారా నిర్వాహకులకు తెలియజేయవచ్చు. స్క్రిప్ట్ ఫైల్‌ను తయారు చేసి పంపాలనుకుంటే Submit a Script ఎంచుకోండి. స్పోకెన్ ట్యుటోరియల్‌ను పంపాలనుకుంటే Submit a spoken Tutorial క్లిక్ చేయండి. Study Plans for విభాగంలో Latex, Scilab, Pythonసాఫ్ట్‌వేర్ వీడియోలను నిక్షిప్తం చేశారు.
బ్లాగులు.. ఫోరం
స్పందనల్ని, విశ్లేషణల్ని పంచుకోవడానికిBlog, Forum సర్వీసులు కూడా ఉన్నాయి. Create Contentపై క్లిక్ చేస్తే, బ్లాగ్ ఎంట్రీ, ఫోరం టాపిక్ ఆప్షన్లతో మరో విండో ప్రత్యక్షమవుతుంది. బ్లాగులో ఏదైనా అంశాన్ని పోస్ట్ చేయాలనుకుంటే Create blog Entry క్లిక్ చేయండి. ఇలాగే ఫోరం టాపిక్‌ని కూడా పోస్ట్ చేయవచ్చు. ఇతర వివరాలకుSpoken-Tutorials
Subscribe to:
Post Comments (Atom)