Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
ప్రశ్న-జవాబులు
12 February 2010Posted by
INDUSTAN
0 Comments
కొత్తగా ఏదైనా యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసి, అప్‌డేట్ చేసిన తర్వాత సిస్టంని పూర్తిగా స్కాన్ చేయండి. కింది వెబ్‌సైట్ ఆధారంగా వైరస్‌ను మాన్యువల్‌గా డిలీట్ చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు.
http://infosecawareness.in/virus-spam-phishing/how-to-remove-the-virus-manually
http://amiworks.co.in/talk/how-to-remove-new-folderexe-or-regsvrexr-or-autoruninf-virus/
*విండోస్ 7 64 బిట్ హోం ప్రీమియం వెర్షన్ వాడుతున్నాను. సీ డ్రైవ్ 285 జీబీ. ఇప్పుడు సీ డ్రైవ్‌ని పార్టీషన్ చేసి 100 జీబీతో డీ, 100తో జీబీ ఈ డ్రైవ్‌లను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో తెలుపగలరు?
కింది సైట్‌లోని Easus Partition Master టూల్ హోం ఎడిషన్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రయత్నించండి. partition-tool.com/
*ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాను. కొన్ని రోజులు సిస్టంలోని కొన్ని సాఫ్ట్‌వేర్‌లు సరిగా పని చేయడం లేదు. ఇన్‌స్టాల్ చేస్తుంటే మధ్యలో data cobinet file error అని వచ్చి file missed retry to copyఅని మెసేజ్ వస్తోంది. cabinet ఫైల్ ఎర్రర్ నుంచి సాఫ్ట్‌వేర్‌లను కాపాడడం ఎలాగో తెలుపగలరు?
కేబినెట్ ఎర్రర్ అనేది అప్లికేషన్ బట్టి ఉండొచ్చు. ఉదాహరణకి ఆఫీస్ అప్లికేషన్ కోసం ఈ కింది వెబ్‌సైట్‌లో చెప్పినట్టుగా పరిష్కరించుకోవచ్చు. support.microsoft.com/kb/284250
*ల్యాప్‌టాప్‌ను విండోస్ ఎక్స్‌పీతో వాడుతున్నాను. Apology Ur Software/hardware edameged, windows xp failure అనే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. పరిష్కారం తెలుపగలరు?
మీరు పంపిన ప్రశ్నలో ఎర్రర్ మెసేజ్ పూర్తిగా పంపితే సరైన సమాధానం ఇవ్వొచ్చు. మీ హార్డ్‌డిస్క్ ఫెయిల్ అయినా, మెమొరీ సరిగా పని చేయకపోయినా ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. మీ హార్డ్‌డిస్క్, మెమొరీ మాడ్యూల్స్‌ని రిమూవ్ చేసి మళ్లీ పెట్టండి. అంతేకాకుండా బయోస్‌ని ఒక్కసారి చెక్ చేయండి.
*నా కంప్యూటర్‌లో ఉన్న 10 జీబీ స్పేస్‌ని C D E F గా విభజించాను. సీ డ్రైవ్‌లో 8.25 జీబీ మెమొరీ వరకూ వాడేశాను. దీంతో కొన్ని ఫైల్స్ నెమ్మదిగా ఓపెన్ అవుతున్నాయి. ఏం చేయమంటారు?
మీ ఆపరేటింగ్ సిస్టం ఫైల్స్, ప్రోగ్రాంకు సంబంధించిన ఫైల్స్ సీ డ్రైవ్‌లో ఉండడం వల్ల అది నిండిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ డ్రైవ్ నిండిపోతే ఫైల్స్‌ని యాక్సెస్ చేయడం స్లో అవుతుంది. అందుకే సీ డ్రైవ్‌లోని టెంపరరీ ఫైల్స్, డెస్క్‌టాప్‌పై ఉన్న పర్సనల్ ఫైల్స్‌లను వేరే డ్రైవ్‌ల్లోకి కాపీ చేయండి. సీ డ్రైవ్‌లో ఎక్కువ స్పేస్ ఉండేటా చేయండి.
Subscribe to:
Post Comments (Atom)