Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
చిటికెలో...! హెచ్చరిక:Warning, Hacking
19 January 2010Posted by
INDUSTAN
0 Comments
చిటికెలో...!
హెచ్చరిక:
2010లో హ్యాకర్ల ప్రధాన లక్ష్యం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లేనని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ Mcafee హెచ్చరిస్తోంది. యూఆర్‌ఎల్ లింక్స్‌ని చిన్నవిగా చేసే సర్వీసుల్ని కూడా సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని సంస్థ తెలియజేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్, ఈ-మెయిల్ మెసేజ్‌లను ఓపెన్ చేయకపోవడమే మంచిదని సూచిస్తోంది. నిషేధం: సులువుగా వూహించగలిగేలా ఉన్న 370 పాస్‌వర్డ్‌లను ట్విట్టర్ నిషేధించింది. 123456,Password లతో పాటు Porsche, Ferrari... లాంటి పేరొందిన ఉత్పత్తులు ఆ జాబితాలో ఉన్నాయి. ఆన్‌లైన్ వ్యవహారాలు చేస్తున్న వారిలో 46 శాతం యూజర్లు అన్ని సర్వీసులకు ఒకే పాస్‌వర్డ్‌ని వాడుతున్నారని, ఐదుగురిలో ఒకరు పెంపుడు జంతువుల పేర్లు, ఎనిమిది మందిలో ఒకరు పుట్టినరోజు, మర్చిపోలేని సంఘటనలు జరిగిన తేదీల్ని పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని బ్రిటన్ ఒక సర్వేలో చెబుతోంది.
Subscribe to:
Post Comments (Atom)