Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
పెద్ద 3డి టీవీ
19 January 2010Posted by
INDUSTAN
0 Comments
పె....ద్ద 3డి టీవీ!
3డీ సినిమా చూడాలంటే ధియేటర్‌కు వెళ్తున్నారా? ఏం అక్కర్లేదు. ఇంట్లోనే చూడొచ్చు! సినిమానే కాదు, వీడియో గేమ్స్.. క్రికెట్.. ఫుట్‌బాల్ అన్నీ 3డీలోనే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోని సోఫాసెట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం మీ కళ్లముందే కదలాడుతుంది. ఎలాగో తెలుసా? 3డీ టీవీలు వచ్చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెలివిజన్ కంపెనీలు ఇప్పుడు 3డీ టీవీలపైనే దృష్టి పెడుతున్నాయి. మొన్నటి వరకూ అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగినConsumer Electronics Show 2010లో వివిధ కంపెనీలు 3డీ టీవీలను ప్రదర్శించగా పెనాసోనిక్ తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పింది.
ఇదే మొదటిది
మీకు ఎన్ని అంగుళాల టీవీ తెలుసు చెప్పండి. ఓ 100 అంగుళాలున్న సాధారణ టెలివిజన్ అంటారా? అయితే 152 అంగుళాలున్న హెచ్‌డీ టెక్నాలజీతో కూడిన 3డీ టీవీని ఒక్కసారి హించండి. చిన్న సైజు మినీ ధియేటరే కదూ! కనిపిస్తున్న టీవీ అదే. దీన్ని ప్రముఖ కంపెనీ పెనాసోనిక్ తయారు చేసింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద పరిమాణంలో తయారు చేసిన మొట్టమొదటి 3డీ టీవీ కూడా ఇదే. హై పిక్సల్ రిజల్యుషన్, ప్లాస్మా డిస్‌ప్లే ప్యానల్, క్రిస్టల్ క్లియర్ 3డీ ఇమేజింగ్, దీని ప్రత్యేకతలు. గత ఏడాదే రికార్డ్ స్థాయిలో 103 అంగుళాల హెచ్‌డీటీవీ 3డీని రూపొందించిన విషయం తెలిసిందే! http://3d.panasonic.net/en/
Subscribe to:
Post Comments (Atom)