Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు

19 January 2010

సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు భలే వారధులు
మీరు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రియులా? ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు వాడుతున్నారా? అయితే, ఈ ఏడు వారధులు మీకు తప్పని సరి! ఫేస్‌బుక్‌.. మైస్పేస్‌.. ట్విట్టర్‌.. లింక్డిన్‌.. ఇలా అన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ల్లోనూ సైన్‌ఇన్‌ అయ్యి మిత్ర బృందంతో ఆన్‌లైన్‌ రచ్చబండపై విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుకోవడం నేటి తరం నెటిజన్లకు సర్వసాధారణం అయిపోయింది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల యూజర్లు సభ్యత్వం తీసుకున్నారంటే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పరిధిని అంచనా వేయవచ్చు. అంతేకాదు 3.5 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి స్నేహితులతో పంచుకుంటూ రోజులో 55 నిమిషాలు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేసుకునే మార్గాలున్నాయి. ఒక్కొక్కటిగా సైన్‌ఇన్‌ అవ్వకుండానే అన్ని అప్‌డేట్స్‌ని సులువుగా ఒకేచోట పొందొచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం!
ఈక్రింద ఇవ్వబడినవి




అన్నీ డెస్క్‌టాప్‌పైనే



పేరు: 8hands Desktop


ఇదో డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌. మీరు సభ్యత్వం తీసుకున్న ఫేస్‌బుక్‌, ఫ్లిక్కర్‌, యూట్యూబ్‌, మైస్పేస్‌, బ్లాగుల అప్‌డేట్స్‌ని సులువుగా తెలుసుకోవచ్చు. అన్ని నెట్‌వర్క్‌ల్లోని ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ని పూర్తిస్థాయిలో నిర్వహించుకోవచ్చు. వివిధ నెట్‌వర్క్‌ల నుంచి స్నేహితులు పంపే కామెంట్స్‌, మేసేజ్‌, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌, వీడియోలు..లాంటి ఇతర అప్‌డేట్స్‌ని ఆయా సర్వీసుల్లోకి సైన్‌ఇన్‌ అవ్వకుండానే తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే ఐకాన్స్‌ రూపంలో మీరు సభ్యత్వం తీసుకున్న సర్వీసుల్ని ప్రత్యేక 8 హ్యాండ్స్‌ బాక్స్‌లో కనిపిస్తాయి. టాప్‌ ఫ్రెండ్స్‌బాక్స్‌లో మీ స్నేహితుల ప్రొఫైల్స్‌ కనిపిస్తాయి.latest events, Photo Gallery, add as freind లను మెనూల మాదిరిగా చూడొచ్చు. మొబైల్‌ ఫోన్‌లో కూడా దీన్ని వాడుకోవచ్చు. సైట్‌లోకి వెళ్లి కనిపించే  Download Now ప్రై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. www.8hands.com
కౌంట్‌లు ఎన్నయినా
ఎపేరు: atomkeep
వాడుతున్నది ఏ సోషల్‌ నెట్‌వర్క్‌ అయినా మీ ఫ్రొఫైల్‌ని దీంట్లో ఇంపోర్ట్‌, సింక్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఎలాంటి సాఫ్ట్‌వేర్‌నీ ఇన్‌స్టాల్‌ చేసుకోనక్కర్లేదు. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్‌ అయ్యి 33 సర్వీసుల్ని ఒకేచోట యాక్సెస్‌ చేయవచ్చు. మరో 12 సర్వీసుల్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. మీరు ఉద్యోగం కోసం అన్వేషణ చేస్తున్నట్లయితే ఆయా నెట్‌వర్క్‌లో మీ బయోడేటాని సులువుగా ఇతరులతో పంచుకోవచ్చు. www.atomkeep.com

వెతికి పట్టుకోండి



పేరు:Friendbinder

వివిధ నెట్‌వర్క్‌ల్లో ఉన్న మీ స్నేహితులతో సమాచారాన్ని పంచుకోవడం కష్టంగా ఉంటే ఫ్రెండ్‌బైండర్‌లో సభ్యత్వం తీసుకుంటే సరి! ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఫ్లిక్కర్‌, యూట్యూబ్‌, లాస్ట్‌ఎఫ్‌ఎం, డెలిషియస్‌, డిగ్‌, బ్లాగ్‌ సర్వీసుల్లో ఉన్న స్నేహితులంతా ఒకేచోట చేరిపోవచ్చు. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్‌ అవ్వగానే యాక్టివిటీ, మెనూబార్‌, అప్‌డేట్‌ స్టేటస్‌లతో పేజీ ఓపెన్‌ అవుతుంది. మెనూబార్‌లోని ఫ్రెండ్స్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు. http://friendbinder.com
ఒకేచోట పంచుకోండి
పేరు: Friendfreed
ఫేస్‌బుక్‌, గూగుల్‌ గ్రూప్స్‌, ట్విట్టర్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ సర్వీసుల్లో ఉన్న వారితో విలువైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇదో చక్కని మార్గం. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సభ్యత్వ నమోదు చేసుకుని మీరు వాడుతున్న నెట్‌వర్క్‌లను ఎంచుకోవాలి. జీమెయిల్‌, యాహూ, హాట్‌ మెయిల్‌లను కూడా యాక్సెస్‌ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏ సోషల్‌ నెట్‌వర్క్‌లోనూ సభ్యులు కానివారికి మీరు వాడుతున్న మెయిల్‌ సర్వీసుని ఎంచుకుని యాక్సెస్‌ గ్రాంట్‌ చేయండి. మీ మెయిల్‌ లిస్ట్‌లో ఫ్రెండ్‌ఫీడ్‌లో సభ్యులు కాకపోతే ఆహ్వానాల్ని పంపండి.Find recommendations తో ఇతరులు పోస్ట్‌ చేసిన సమాచారాన్ని చూడొచ్చు. కేవలం మీ స్నేహితులు పంచుకునే పోస్టింగ్స్‌ని చూడాలనుకుంటేsee Your Friendfeed క్లిక్‌ చేయండి. Subscribe ద్వారా ఇతరులకు రిక్వెస్ట్‌ పంపొచ్చు. గ్రూప్స్‌ క్రియేట్‌ చేసుకుని వారితో మాత్రమే డేటాని పంచుకోవచ్చు. http://friendfreed.com



అప్‌డేట్స్‌ అన్నీ ఇక్కడే
పేరు: Ping.fm
సోషల్‌ నెట్‌వర్క్‌లకు ఇదో వారధిగా చెప్పుకోవచ్చు. దీంట్లో రిజిస్టరయితే 43 సోషల్‌ నెట్‌వర్క్‌లను దీంట్లోనే యాక్సెస్‌ అప్‌డేట్‌ చేయవచ్చు. సైన్‌ఇన్‌ అవ్వగానే కనిపించే జాబితాలో మీరు వాడుతున్న నెట్‌వర్క్‌లను Add Network పై క్లిక్‌ చేసి ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు LinkedIn ను యాక్సెస్‌ చేయాలనుకుంటే దాన్ని ఎంచుకుని తర్వాత వచ్చిన పేజీలో Link Ping.fm to LinkedIn ను క్లిక్‌ చేయండి. ఈమెయిల్‌ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి బిr్చ్థ్మ త్ఞ్ఞ్ఠ్బ్బి ఎంచుకుని లింక్డిన్‌ సర్వీసుని పింగ్‌.ఎఫ్‌ఎంలోనే పొందొచ్చు. మిగిలిన అన్ని సర్వీసుల్లోకీి ఇలానే లాగిన్‌ అవ్వొచ్చు. http://ping.fm


నెట్‌వర్క్‌ల సరస్సు
పేరు: Pond



 ఆన్‌లైన్‌లోనూ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ రూపంలోనూ ట్విట్టర్‌, ఫ్లిక్కర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లను పాండ్‌లో కలిసేలా చేయవచ్చు. స్నేహితుల్ని వెతికి పట్టుకుని వారి అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు. మీరు బ్రౌజ్‌ చేసిన సమాచారాన్ని అన్ని నెట్‌వర్క్‌ల్లోని వారితో పంచుకోవచ్చు. మొబైల్‌లో కూడా దీన్ని వాడుకోవచ్చు .http://web.pond.pt

ఇదో యాడ్‌ఆన్‌


పేరు: Shareaholic


సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌, ఆన్‌లైన్‌ సర్వీసులా కాకుండా యాడ్‌ఆన్‌ రూపంలో మీరు వాడుతున్న బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్‌, ఐఈ, క్రోమ్‌, సఫారీ, ఫ్లాక్‌ బ్రౌజర్లు దీన్ని సపోర్ట్‌ చేస్తాయి. సైట్‌లోకి వెళ్లి దీన్ని బ్రౌజర్‌కు యాడ్‌ చేయగానే ప్రత్యేక ఐకాన్‌ రూపంలో టూల్‌బార్‌లో కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీకు కావాల్సిన సర్వీస్‌లో లాగిన్‌ అవ్వచ్చు. www.shareaholic.com







0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English