Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

ఇక మీ ఇష్టం మొబైల్‌ దీమ్స్‌ !

20 January 2010

సైట్‌ పీసీ, మ్యాక్‌లకు ప్రత్యేక వెర్షన్లను అందుబాటులో ఉంచారు. మీరు పీసీ వాడుతుంటే Download for Pc పై క్లిక్‌ చేసి సెట్‌అప్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. జీప్‌ ఫార్మెట్‌లో ఉన్న ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి .exe ఫైల్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. దీంతో Start->All Programs->Sony Ericsson->Themes Creator ప్రొగ్రాం కనిపిస్తుంది. అలాగే, డెస్క్‌టాప్‌పై షార్ట్‌కట్‌ ప్రత్యక్షమవుతుంది. డబుల్‌క్లిక్‌ చేసి ఓపెన్‌ చేయగానేBackground, Colour Scheme, Style, Preview ఆప్షన్లతో ప్రత్యేకమైన టూల్‌బార్‌, మెనూబార్‌లతో దీᄆమ్స్‌ క్రియేటర్‌ కనిపిస్తుంది.
ఇక మొదలెట్టండి!

ముందుగా టూల్‌బార్‌లో కుడివైపున కనిపించే బాక్స్‌లో మీరు వాడుతున్న సోనీ ఎరిక్సన్‌ మోడల్‌ని ఎంచుకోండి. ఉదాహరణకు మీరు W200 ని ఎంచుకుంటే సెలెక్ట్‌ మోడ్‌ పేరుతో Create your theme using the wizard, Edit your them in advance mode ఆప్షన్లు వస్తాయి. మొదటి మోడ్‌తో 128 x 160 తెర పరిమాణంలో Navigation , Desktop, Standby బాక్స్‌లు కనిపిస్తాయి. వాటి కింద కనిపించే కంప్యూటర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి సిస్టంలోని ఇమేజ్‌ని బాక్స్‌లోకి ఇంపోర్ట్‌ చేయాలి. ఇంపోర్ట్‌ విండోలోని జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌ ద్వారా ఎంచుకున్న ఇమేజ్‌ని తెరకు సరిపోడేలా చేయవచ్చు. ఫొటోని Rotate తో తిప్పుకోవచ్చు కూడా. ఒకవేళ మీరు పెద్ద ఇమేజ్‌ను ఎంచుకుంటే Fit in ని క్లిక్‌ చేసి తెరకు సరిపడేలా చేయవచ్చు. Color Scheme ద్వారా రంగుల్ని ఎంచుకుని, ళ్మ్వ్ద్ఠీతో మెనూల సెk్టల్స్‌ని సెట్‌ చేసుకోవచ్చు. మొత్తం డిజైనింగ్‌ పూర్తయ్యాక Preview సెల్‌ఫోన్‌లో దీᄆమ్‌ ఏ విధంగా కనిపిస్తుందో చూడొచ్చు. సేవ్‌ చేయాలనుకుంటే టూల్‌బార్‌లోని ఫ్లాపీ గుర్తు ఉన్న ఐకాన్‌పై క్లిక్‌ చేయండి.

మరింత ఆకర్షణీయం
స్టేటస్‌బార్‌, సాఫ్ట్‌కీలు, హైలైట్స్‌, ట్యాబ్స్‌, టైటిల్స్‌, టెక్ట్స్‌, స్క్రోల్‌బార్స్‌, పాప్‌అప్స్‌, ఇన్‌పుట్‌, సౌండ్స్‌తో సహా మీకు నచ్చినట్టు మార్చుకోవాలనుకుంటే టూల్‌బార్‌లోని Reset క్లిక్‌ చేసి Edit Your Theme in advance Mode ని ఎంచుకోండి. దీంట్లో కూడా నచ్చిన ఫొటోలను ఇంపోర్ట్‌ చేసుకుని విభాగాల వారీగా మార్చుకుంటూ దీమ్‌ని రూపొందించుకోవచ్చు. బాక్స్‌పై మౌస్‌ పాయింటర్‌ను పెట్టగానే ప్రివ్యూ కనిపిస్తుంది కూడా. వివరాలకు.
www.sonyericsson.com/themescreator

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English