Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

హార్డ్ డిస్క్ పై మూడో భాగం - ఫైల్ సిస్టంలు

19 November 2009


మొదటి రెండు భాగాలలో హార్డ్ డిస్క్ గురించిన ప్రాధమిక అవగావానకి కావాల్సినవి చూశాం. హార్డ్ డిస్క్ తనువైతే, ఫైల్ సిస్టం ఆత్మ. అదెలాగో, ఫైల్ సిస్టం ఏంటో చూద్దాం.




ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలి అంటే ఇద్దరికీ తెలిసిన ఒక భాష ఎలా అవసరమో, హార్డ్ డిస్క్ ని ఆపరేటింగ్ సిస్టం అర్థం చేస్కుని వాడగలగాలి అంటే ఆ రెంటికి ఒక మాధ్యమం అంతే అవసరం! హార్డ్ డిస్క్ లో సృష్టించబడిన పార్టిషన్ కి ఇలాంటి ఒక నిర్మాణమే ఉంటుంది. ఆ పార్టిషన్ లో ఫైల్ పెట్టాలంటే ఏం చేయాలి, ఫైల్ చదవాలంటే ఏం చేయాలి, తీసేయ్యాలంటే ఏం చేయాలి లాంటి ఎన్నో చర్యలకి సంబందించిన ఒక సమగ్ర ప్రణాళికా రూపకల్పననే మనం ఫైల్ సిస్టం అంటాం. ఈ ఫైల్ సిస్టం ని బట్టే ఆపరేటింగ్ సిస్టం ఆ పార్టిషన్ ని గుర్తించగలగటం లేకపోవటం ఆధారపడుతుంది. ఉదాహరణకి, విండోస్ ఆపరేటింగ్ సిస్టంకి FAT, NTFS అనే ఫైల్ సిస్టంలతో  అనుసంధానం తెలుసుగాని, ext3 అనే ఫైల్ సిస్టంని గుర్తించలేదు.

కాబట్టి హార్డ్ డిస్క్ గురించిన మిగతా విషయాలు తెలుసుకోక ముందు ఫైల్ సిస్టం గురించి చెప్పేస్కుందాం. మీరు మొదటి మూడు భాగాలు చదివుండాలి, చదవకపోతే, ఒకసారి అలా, ఇలా వెళ్లి చదివేసి మళ్లీ ఇక్కడికి వచ్చేయండి.

ముందు భాగాలలో, పార్టిషన్ లో ఫైళ్లు అమర్చబడే విధానాన్ని ఫైల్ సిస్టం అన్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఫైల్ సిస్టంల గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత మీకు ఏ ఫైల్ సిస్టం కావాలో అర్థమవుతుంది. ఫైల్ సిస్టం అంటే, అది కేవలం హార్డ్ డిస్క్ మీద పార్టిషన్లకు వాడేది మాత్రమే అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి నేను పాపం మూట కట్టుకోలేను.

ఎందుకంటే, ఫైల్ సిస్టం ఫైల్ ని ఎలా బద్రపరచాలో అనే కాదు, ఆ ఫైల్ ఎలా యాక్సెస్ చేస్తామో కూడా నిర్దేశిస్తుంది. అంటే, ఉదాహరణకి, మీకు రెండు కంపూటర్లు ఉన్నాయనుకోండి. రెండూ నెట్వర్క్ ద్వారా కలపబడి ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక దాంట్లో ఉన్న పార్టిషన్ ని ఇంకో కంప్యూటర్ లో వాడగలగాలి అంటే, ఆ పార్టిషన్ ని అదే కంప్యూటర్ లో ఉపయోగించే విధానానికి భిన్నంగా ఇంకో పద్దతి అవసరం అవుతుంది. ఈ అదనపు పద్దతిని కూడా ఫైల్ సిస్టం అనే అంటారు. అలాంటి వాటిని నెట్వర్క్ ఫైల్ సిస్టంలు అంటారు. వాటి గురించి మరో టపాల స్రవంతి లో మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది -  ఫైల్ సిస్టం అంటే, అది కేవలం హార్డ్ డిస్క్ కనే కాదు, కంప్యూటర్ ద్వారా ఎటువంటి ఫైల్ నైనా యాక్సెస్ చేయడానికి వాడే పద్దతులన్నిటికి కలిపి పెట్టిన పేరు. ఇక మనం డిస్క్ ఫైల్ సిస్టం ల గురించి మాట్లాడుకుందాం.

ఏ ఫైల్ సిస్టం ఐనా కొన్ని ముఖ్యమైన ప్రాధమిక చర్యలకి అవకాశాన్నిస్తుంది. ఆ చర్యలు/సదుపాయాలలో కొన్ని ఇవి - ఫైల్ పేరు, ఫైల్ వివరాలు(యజమాని, సృష్టించబడిన తేది లాంటివి), ఫైల్ సృష్టి, తొలగింపు, మార్పులకి కావాల్సిన విధానాలు. హార్డ్ డిస్క్ ఒక మాగ్నెటిక్ ప్లేట్. దానిలో సెక్టార్లగా ఉండే పరిమాణాన్ని, ఆ బౌతిక నిర్మాణాన్ని, ఫైల్లు పెట్టుకోవడానికి వీలుగా మలిచి, ఆపరేటింగ్ సిస్టం కి ఆ వివరాన్ని తెలిపే ఒక ముఖద్వారంలా ఫైల్ సిస్టంని అర్థం చేస్కోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టంలలో ముఖ్యంగా మనం వాడేవి మూడు - విండోస్, లినక్సు, మాక్ ఓ.ఎస్. ఎక్స్. విండోస్ లో ఎక్కువగా లేదా అసలు వాడేవి రెండు ఫైల్ సిస్టం లు - NTFS, FAT. లినక్సు లో మూడు - ext3, ext4, reiserfs. మాక్ ఓ.ఎస్. ఎక్స్ లో ఒకటి - HFS+. ఇవే కాక ఇంకా ఉన్నాయి కానీ, వాటి గురించి ఇక్కడ చర్చించేంత సీన్ వాటికుందని రచయిత అనుకోవట్లేదు(క్షమించాలి, సరదాకి అన్న మాట మాత్రమే :) ), లేదా, అవి చాలా చాలా పాతవి అయ్యి ఎవరూ వాడటం లేదు.
అన్ని ఫైల్ సిస్టం లని పోల్చుతూ ఇక్కడ ఒక పట్టీ గీశాను, చూడండి, మీరు ఇట్టే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. పట్టీ మూలం వికీపీడియా.
ఫైల్ సిస్టం
ఫైల్ పేరు పొడవుకి అవధి
ఫైల్ పేరులో తెలుగు వాడొచ్చా?(యూనీకోడ్)
ఫైల్ సైజు పరమావధి
పార్టిషన్‌ సైజు పరమావధి
ఫోల్డర్ల లోపల ఫోల్డర్లు
NTFS
255 బైట్లు
వాడొచ్చు, /, శూన్యాక్షరం తప్ప
16000 పెటాబైట్లు
16000 పెటాబైట్లు
మొత్తం దారి పొడవు 32,767 యూనీకోడ్ అక్షరాలు ఉండొచ్చు.
FAT
255 బైట్లు
వాడొచ్చు, శూన్యాక్షరం తప్ప
4 గిగాబైట్లు
512 మెగాబైట్లు - 8 టెరాబైట్లు
అలాంటిదేమి చెప్పబడలేదు
Ext3
255 బైట్లు
వాడొచ్చు, శూన్యాక్షరం తప్ప
16 గిగాబైట్లు - 2 టెరాబైట్లు
2 టెరాబైట్లు - 32 టెరాబైట్లు
అలాంటిదేమి చెప్పబడలేదు
Ext4
255 బైట్లు
వాడొచ్చు, శూన్యాక్షరం తప్ప
16 గిగాబట్లు - 16 టెరాబైట్లు
1000 పెటాబైట్లు
అలాంటిదేమి చెప్పబడలేదు
ReiserFS
4032 బైట్లు/255 అక్షరాలు
వాడొచ్చు, శూన్యాక్షరం తప్ప
8 టెరాబైట్లు
16 టెరాబైట్లు
అలాంటిదేమి చెప్పబడలేదు
HFS+
255 బైట్లు
వాడొచ్చు
8000 పెటాబైట్లు
8000 పెటాబైట్లు
అవధేలేదు! ఎన్నైనా ఉండొచ్చు

ఇప్పుడు మీ అవసరం ఏంటో తెలిస్తే, ఏ ఫైల్ సిస్టం నయమో కూడా తెలిసిపోతుంది ఈ పట్టీ చూశాక. ఒకవేళ ఏదైనా సందేహం తీరకుంటే అడగండి.

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English