Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

జి నోమ్ షెడ్యూల్ - అలారాలు - మర్చిపోవడం మర్చిపోండి!

16 November 2009


పొద్దున్నే టైం కి లేవాలి, లేచాక శతకోటి ముఖ్యమైన పనులు చేయాలి. అందులో సవాలక్ష పనులు గుర్తుండనే ఉండవు. రోజూ ఫలానా టైం కి ఫలానా ప్రోగ్రాం రన్ చేయాలి, ఫలానా టైం కి బ్యాక్ అప్ తీస్కోవాలి. పుట్టినరోజులు, పెళ్లి రొజు, యానివర్సరి ఒకటా రెండా!  అబ్బా! అన్నీ గుర్తుపెట్టుకుని చెయ్యాలంటే ఎలా?? అందుకే ఉందిగా మనకో డబ్బా, కంప్యూటర్ అనే పేరు తగలేస్కుని, మనల్ని తట్టి చెప్పే పని దానికి పురమాయిద్దాం! ఆ ఒక్క పని చేసేసి ఈసారి మర్చిపోవడం అంటే ఏంటో మర్చిపోదాం!



లినక్సు లో చాలామందికి తెలియకుండా చీకట్లో మగ్గిపోతున్న ఒక అద్భుతమైన పరికరం ఉంది. క్రోన్ అని! దాని పనల్లా ఒకటే - చేయమన్న పని, చేయమన్న టైం కి చెయ్యడం! కానీ, దాన్ని ఉపయోగించడం లో తికమకలు పడలేక చాలామంది దాన్ని పట్టించుకోకుండా వేరే వాటితో సర్దుకుపోతుంటారు. సాధారణంగా, దాన్ని టెర్మినల్ ఉపయోగించి వాడుకోవాలి. కానీ, ఈ పాఠ్యాంశంలో దాన్ని అందరూ వాడుకునేందుకు వీలుగా, సులువుగా వాడుకోవడం ఎలాగో చూద్దాం.
ముందు జి నోమ్ షెడ్యూల్ అనే ఒక ఉపకరణాన్ని ఇన్స్టాల్ చేస్కోవాలి. క్రింది కమాండ్ ఉపయోగించి ఆ పని చేయండి ముందు.
sudo apt-get install gnome-schedule
ఇప్పుడు, ఆల్ట్-f2 కొట్టి, gnome-schedule అని టైపు చేసి రన్ చేయండి. లేదా, మెయిన్ మెనూ లో సిస్టం టూల్స్ లో scheduled tasks అని ఉంటుంది, అది క్లిక్ చేసినా ఒకటే. అప్పుడు ఒక విండో తెరుచుకుంటుంది, క్రింది లాగా.





అందులో, పైన ఉన్న New కొడితే, ఒక విండో తెరుచుకుంటుంది. మూడు ఆప్షన్లతో, A task that launches recurrently (మళ్ళీ మళ్ళీ కావాల్సిన పని), A task that launches one-time (ఒక్కసారి మాత్రమే కావాల్సిన పని), A task from predefined template (ముందే నిర్దేశింపబడిన మూసల లాంటి పని).



అందులో, ఉదాహరణకి, మళ్ళీ మళ్ళీ కావాల్సిన పని(recurrent) ఎలా సెట్ చేస్కోవాలో చూద్దాం. సదరు బటన్ మీద నొక్కితే, ఒక విండో వస్తుంది. దాన్ని ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు పూరిస్తే, మిమ్మల్ని పొద్దున్నే ఏడింటి నుంచి, ఎనిమిదింటి దాక, ప్రతి పదిహేను నిమిషాల వ్యవధిలో ఒక పాట పాడి లేపుతుంది :) వివరంగా ఏ ఖాళీ లో ఏం పూరించాలో చూద్దాం.




  • Description: ఇక్కడ మీకు వచ్చిన పేరు పెట్టుకోండి ఈ అలారానికి.
  • Command: ఇక్కడ ఏ కమాండ్ రన్‌ చేయాలనుకుంటున్నారో ఆ కమాండివ్వండి ఆర్గ్యుమెంట్లతో సహా. ఉదాహరణకి అది పాటైతే, mplayer "/home/gopi/Music/alarm.mp3" అని ఇవ్వాలి. ఇక్కడ /home/gopi/Music/alarm.mp3 అన్నదాన్ని మీ సిస్టంలో ఉన్న ఒక పాట ఉన్న దారితో(path) మార్చాలి.
  • Time & Date:
    • Basic: ఇందులో పెద్దగ సెట్ చేస్కొడానికి ఏముండదు. ప్రతి నిమిషం, ప్రతి గంట చేయాల్సిన పనులకి Advanced కి వెళ్ళకుండా పెట్టేస్కునే వీలు మాత్రమే ఇది. ప్రతి రోజు(Every day) ఎంచుకుంటే, ప్రతి రోజు అర్థరాత్రి ౦౦:౦౦ గంటలకు రన్ అవుతుంది. ప్రతి నెల ఎంచుకుంటే, ప్రతి నెల, ౧ వ తారీఖు, ౦౦:౦౦ గంటలకి రన్ అవుతుంది. ప్రతి వారం(Every week) ఎంచుకుంటే, ప్రతి వారం సోమవారం, ౦౦:౦౦ గంటలకి రన్ అవుతుంది. ఇందులో బాగా ఉపయోగపడేది అంటే, At reboot (సిస్టం రీబూట్ చేసినా ప్రతిసారి)
    • Advanced: ఇందులో, మనకు కావాల్సిన విధంగా కావలసినప్పుడు రన్ చేయడానికి పెట్టుకోవచ్చు. ఇందులో Minute, hour, Day, Month, Weekday ఉంటాయి. అన్నిటికీ, ఒకటే పద్దతి - పక్కన ఉన్న Edit బటన్ నొక్కితే ఒక విండో వస్తుంది. క్రింది లాగా. ఉదాహరణకి, నిమిషానికి చూద్దాం. మిగతా వాటికి కూడా అంతే. అందులో,
      • Every minute ఎంచుకుంటే, ప్రతి నిమిషం మోగుతుంది.
      • In a step width ఎంచుకుంటే ఎన్ని నిమిషాలకి ఒకసారి మోగాలో చెప్పొచ్చు.
      • In a range ఎంచుకుంటే, ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు మోగాలో చెప్పొచ్చు.
      • At an exact minute ఎంచుకుంటే, ఆ ఒక్క నిమిషం మాత్రమే మోగాలని చెప్పినట్టు.




ఇప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు, పదిహేనో తారీఖు ఏదో ఒక పని గుర్తుచేసేలా పెడదాం. ముందు మీరు ఇక్కడ చూడకుండా ప్రయత్నించండి. ఆ తర్వాత ఈ క్రింది విండో లో ఉన్నట్టే చేసారేమో చుస్కుకోండి.



ఇప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు, పదిహేనో తారీఖు ఏదో ఒక పని గుర్తుచేసేలా పెడదాం. ముందు మీరు ఇక్కడ చూడకుండా ప్రయత్నించండి. ఆ తర్వాత ఈ క్రింది విండో లో ఉన్నట్టే చేసారేమో చుస్కుకోండి.


ఇందులో క్రిందున్న Task లోనే కమాండివ్వాలి. మర్చిపోవద్దు సుమా! సౌండు మ్యూట్ ఉందేమో చూసుకోండి, వినపడకపోతే పెట్టుకున్న పుణ్యం ఉండదు :)


టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English