Loading

టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి

Share |

నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు

10 September 2009


మనం రోజూ లినక్‌స్‌లో చేసే పనులకు కావలసిన సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది. వీటిని (వీటిలో కొన్నింటిని) ఇంస్టాల్ చేసుకొంటే సాధారణ వాడుకరులకు కావలసిన అన్ని పనులూ చేసుకోవచ్చు.

సాధారణంగా వాడే లినక్స్ ఉబుంటు. ఆర్డర్ చేస్తే ఉచితంగా ఇంటికి సీడీ పంపుతారు. కానీ ఇది ఇంస్టాల్ చేసుకున్న తరువాత ఇందులో మనకు అవసరమైయ్యే సాఫ్ట్వేర్లు ఉండవు. వాటిని ఇంస్టాల్ చేసుకోవాలి.

మనకు నిత్యం అవసరమైయ్యే సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది.

కేవలం ఉబుంటు లినక్సుకు మాత్రమే కాదు ఈ సాఫ్ట్వేర్లు అన్ని లినక్సులకూ పనిచేస్తాయి. అన్నీ ఉచితంగా లభిస్తాయి.

క్రింది జాబితాలో అన్నీ ఇంస్టాల్ చేసుకోనవసరం లేదు, మీరు తరచూ వాడే సాఫ్ట్వేర్‌ల జాబితాలోకి వచ్చే వాటిని వాడితే సరిపోతుంది.

ఇంటెర్‌నెట్ :

1. బ్రౌజర్ : ఫైర్ ఫాక్‌స్.

2. ఫైర్ ఫాక్‌స్ యాడ్‌-ఆన్‌లు మరియూ ఎక్‌స్టెన్‌షన్‌లు (Firefox addons) : పద్మా (Padma), ఎక్స్-మార్క్స్ (Xmarks), ఆంసర్స్ (Answers), స్టంబుల్ అపాన్ (Stumblw-Upon), కూల్-ఐరిస్ (Cooliris), ఫ్లాష్ సపోర్ట్

3. డౌంలోడ్ మ్యానేజర్: డీ4ఎక్స్ (D4X), జి.డబ్లూ.గెట్ (gwget)

4. ఇంస్టంట్ మెసెంజర్ (చాటింగ్): పిజియన్ (pidgin), స్కైప్ (skype)

5. టోరెంట్ క్లైంట్ : కె-టోరెంట్ (kTorrent), వూజ్ (vuze)

6. మరి కొన్ని : గూగుల్ అర్‌థ్ (Google Earth), పికాసా (Picasa)

ఆడియో వీడియో :

1. వీడియో : వీ.ఎల్.సి (VLC), ఎస్.ఎం.ప్లేయర్ (SMPlayer), టోటెం ప్లేయర్(Totem Player), మిథ్‌టీవీ (mythtv).

2. పాటల కోసం : అమెరాక్ (Amarok), సాంగ్ బర్డ్ (Song Bird).

3. వీడియో కన్‌వర్టర్‌లు :
ఇరివర్‌టర్ (iriverter).

4. అడియో కన్‌వర్టర్‌లు :
సౌండ్ కన్‌వర్టర్‌ (sound converter).

5. డెస్‌క్‌టాప్ రికార్డర్ :
రికార్డ్ డెస్‌క్‌టాప్ (recorddesktop).

తక్కినవి :

భాషలు :
తెలుగుతో పాటుగా కావలసిన ఇతర భాషలు.

సాఫ్ట్వేర్ ఇంస్టాలర్‌లు : వైన్ (Wine), సినాప్‌టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(Synaptic Package Manager), ఏలియన్ (alien).

ఆఫీస్ టూల్‌స్ : ఓపెన్ ఆఫీస్ (Open Office).

సీడీ డీవీడీ బర్నర్ : కె3బి (K3b).

ఆటలు : పింగూస్ (pingus), జీయల్-117 (gl-117), జియల్‌ట్రాన్ (gltron).

మల్టీ మీడియా : జింప్ (Gimp), చీస్ (cheese) - వెబ్ క్యాం ఉన్నవారికి మాత్రమే.

డెస్‌క్‌టాప్ అపియరెంస్ : కాంపిజ్-కాంఫిగ్-సెట్టింగ్-మ్యానేజర్ (ccsm), స్క్రీన్‌లెట్‌స్‌ (screenlets), వాల్‌పేపర్ ట్రే (wallpaper-tray), ఎమెరాల్‌డ్ (Emerald).

నెట్వర్కింగ్ :
ఓపెన్ ఎస్‌ఎస్‌ఎచ్ క్లైంటు మరియూ సర్వర్ (openssh client and server), డీ.సీ.ప్లస్‌ప్లస్ (DC++), కే.డీ.ఈ.బ్లూటూత్ (kdebluetooth).

ప్రోగ్రామింగ్ : క్వాంటా ప్లస్ (Quanta Plus), బిల్‌డ్-ఎసెన్షియల్ (Build-essential), మై-ఎస్‌క్యూఎల్(MySQL), అంబ్రెల్లో (Umbrello), అప్యాచీ (Apache), జిసిసి (gcc), యాక్యుయేక్ (yakuake).

వర్చువల్ మెషిన్ : వర్చువల్ బాక్‌స్ (VirtualBox).

డిస్క్ టూల్స్ : ఎన్‌టీఎఫ్‌ఎస్-కాన్‌ఫిగ్ (ntfs-config)


0 comments:

Online Dictionary

Webster's Online Dictionary with Multilingual Thesaurus Translation

English Non-English