Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
29 August 2009Posted by
INDUSTAN
0 Comments

లక్ష్యం:
ఇప్పుడు చాలా సైట్లు ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఉంటున్నాయి. ఐతే అలా తెలుగు లో ఉన్న సైట్లు ఆటోమాటిక్ గా ఏ సమస్యా లేకుండా మీకు తెలుగు లో కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? రెండే స్టెప్పులు! మీరు వాడుతున్న విహారిణి ఏంటో తెలుసుకుని, దాన్నిబట్టి ఈ క్రింద వాటిలో మీకు ఏది వర్తిస్తుందో అదిచేయండి.
ఫైరుఫాక్సు వాడుతున్న వారు, ఫైరుఫాక్సు తెరిచి
- విండోస్ లో ఐతే Tools > Options కి, లినక్సు లో ఐతే Edit > Preferences కి వెళ్ళండి. అక్కడ content ట్యాబు లో Languages ఉన్న చోట Choose క్లిక్ చేయండి. అక్కడ వచ్చిన లిస్టుకి తెలుగుని కలిపి, ఆ కలిపిన తర్వాత తెలుగు ని ఎంచుకుని, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. చివరికి ఇదిగో ఈ క్రింద చూపించినట్టు ఉండాలి.
- ఆ content ట్యాబు లోనే, "Fonts & Colors" లో "Advanced" ని క్లిక్ చేయండి. అక్కడ Character Encoding అని ఉన్నదాన్ని Unicode (UTF - 8) అన్నదానికి సెట్ చెయ్యండి. ఇప్పుడు OK కొట్టేయండి. ఆ content ట్యాబు ఉన్న విండోని కూడా మూసెయ్యండి. ఇకపై తెలుగులో ఉన్న సైట్లన్నీ మీకు తెలుగులోనే కనబడతాయి.
IE(ఇంటర్నెట్ ఎక్సప్లోరర్) వాడుతున్నవారు, IE తెరిచి
- Internet Options తెరిచి, అందులో General ట్యాబు లో క్రింద Languages అని ఒక బటన్ ఉంటుంది. నొక్కి, అక్కడ వచ్చిన లిస్టుకి తెలుగుని కలిపి, ఆ కలిపిన తర్వాత తెలుగు ని ఎంచుకుని, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. చివరికి ఇదిగో ఈ క్రింద చూపించినట్టు ఉండాలి.
- ఈ స్టెప్పు సాధారణంగా అవసరం పడదు. కానీ ఒకవేళ తెలుగు వెబ్ పేజి సరిగ్గా కనబడకపోతే, పాత IE(వెర్షన్ 5,6) లో పైన మెనూలో ఉన్న View లోకి వెళ్ళండి. కొత్త IE(వెర్షన్ 7,8) లో ఐతే మెనూలో ఉన్న Page కి వెళ్ళండి. అక్కడ Character Encoding అని ఉన్నదాన్ని Unicode (UTF - 8) అన్నదానికి సెట్ చెయ్యండి.
క్రోమ్ వాడుతున్నవారైతే, క్రోమ్ తెరిచి
- కుడిచేతి వైపున్న రెంచి మార్కు మీద నొక్కి, Options ఎంచుకోండి. అందులో, Minor Tweaks కి వెళ్లి, Fonts & Languages ని నొక్కండి. ఆ వచ్చిన విండోలో, Font and encoding ట్యాబు లో, Encoding ని Unicode (UTF-8) కి మార్చండి. ఇప్పుడు Language ట్యాబుకి వెళ్లి, అక్కడ ఉన్న లిస్టు కి తెలుగు ని కలిపి, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయోచు, కానీ మీరు క్రోమ్ మొత్తాన్ని తెలుగులోనే వాడాలనుకుంటే, అక్కడే ఉన్న google chrome language ని తెలుగు కి మార్చండి. ఇలా మార్చినప్పుడు ఒక్కసారి క్రోమ్ ని మూసేసి మల్లి తెరవమంతుంది, చేసెయ్యండి. ఇకపై మీరు తెలుగు సైట్లన్నీ తెలుగులో చదువుకోవచ్చు, కోరుకునుంటే క్రోమ్ మొత్తాన్ని తెలుగులో వాడుకోవచ్చు!
- రెండో స్టెప్పు లేదులెండి :)
ఒపేరా వాడుతున్నవారైతే, ఒపేరా తెరిచి
- Tools > Preferences కి వెళ్లి, General ట్యాబు లో, Language దగ్గర, Details అని ఒక బటన్ ఉంటుంది. అది నొక్కితే ఒక విండో వస్తుంది. అక్కడ "Encoding to assume..." అన్నదాన్ని utf-8 కి మార్చండి. అక్కడే, Preferred languages for web pages లో ఉన్న లిస్టుకి తెలుగుని కలిపి, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. ఆ general ట్యాబు ఉన్న విండో లో కూడా OK కొట్టేయండి.
- దీనికి రెండో స్టెప్పు అవసరం లేదు :)
Labels:
తెలుగు చదవడం
Subscribe to:
Post Comments (Atom)