Loading
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?
28 August 2009Posted by
INDUSTAN
0 Comments
లక్ష్యం:
ఈ టపా చదివిన తరువాత, మీరు డీఫ్రాగ్‌మెంటేషన్ అనగా ఎమీటి? ఎందుకు చేయాలి? విండోస్‌లో దీన్ని ఎలా చేయాలి? అన్న విషయలను తెలుసుకొంటారు.
డీ-ఫ్రాగ్ అంటే ఏమిటి?
ఏదైనా పెద్ద ఫైల్ ను మీరు మీ కంప్యూటర్ లో సేవ్ చేసినపుడు అది ఒకే చోట సేవ్ కాకుండా, ముక్కలు ముక్కలుగా వివిద ప్రాంతాల్లో ఉంచబడుతుంది. క్రింది బొమ్మలో, ఒక్కో రంగూ ఒక్కో ఫైల్ అన్నమాట, అది de-Fragment చేయటానికి మునుపు ఎలా ఉన్నాయి, ఎలా de-Frag నిర్వహించబడుతుంది, తరువాత ఎలా మరుతాయి అన్న అంశాలకు ఉదాహరణ చూడగలరు.
ఈ ఇబ్బంది లినక్స్ యూజర్లకు ఉండదు. ఎందుకంటే లినక్స్ లో ఎప్పటికప్పుడు De-fragmentation దానంతటదే అవుతూ ఉంటుంది.
ఎందుకు చేయాలి?
కంప్యూటరు ఇంకాస్త వేగంగా పని చేసే అవకాశం ఉంది. మరియూ వీలైనంత ఖాళీని ఒకే చోటకు చేర్చగలదు.
విండొస్‌లో ఎలా చేయాలి?
1. My Computerకు వెళ్ళి, మీరు ఏ పార్టిషన్ను డీ-ఫ్రాగ్మెంట్ చేయాలో దాన్ని Right-Click చేసి Propertiesను ఎంచుకోండి.
2. కొత్తగా వచ్చిన విండోలో Tools అనే ట్యాబులో Defragment Now అన్న బటను ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి.
పూర్తి కావటానికి కొన్ని నిమిషాల నుండీ కొన్ని గంటల సమయం తీసుకుంటుంది.
Labels:
డీ-ఫ్రాగ్ మెంట్,
విండోస్
Subscribe to:
Post Comments (Atom)